ZIM v IND 2024: జింబాబ్వేతో నేడు మూడో టీ20.. టీమిండియా తుది జట్టుపై గందరగోళం

ZIM v IND 2024: జింబాబ్వేతో నేడు మూడో టీ20.. టీమిండియా తుది జట్టుపై గందరగోళం

భారత్, జింబాబ్వే ల మధ్య 5 టీ20 సిరీస్ లో భాగంగా నేడు (జూలై 10) మూడో టీ20 జరగనుంది. రెండో టీ20లో భారీ విజయం సాధించిన టీమిండియా.. మూడో మ్యాచ్‌‌‌‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో ఆతిధ్య జట్టు భారత్ కు షాకిస్తే.. రెండో టీ20 లో భారత్ 100 పరుగుల తేడాతో గెలిచి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. బుధవారం జరిగే ఈ పోరులో జింబాబ్వేను ఓడించి సిరీస్‌‌‌‌లో ఆధిక్యంలో నిలవాలని భారత్  టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ తుది జట్టు విషయంలో ఆసక్తి నెలకొంది. 

టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న ప్లేయర్స్ శివమ్ దూబే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ టీమిండియా స్క్వాడ్ లో చేరారు. వీరి రాకతో తుది జట్టు ఎలా వుండబోతుందనే సందిగ్ధత ఉంది.  ముఖ్యంగా ఓపెనర్లలో కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌కు తోడుగా యశస్వి, అభిషేక్‌‌‌‌లో ఎవరికి చాన్స్‌‌‌‌ ఇస్తారో చూడాలి. ఒకవేళ టాప్‌‌‌‌–3లో ఈ ముగ్గుర్ని కొనసాగిస్తే రుతురాజ్‌‌‌‌ నాలుగో ప్లేస్‌‌‌‌లో ఆడాల్సి వస్తుంది. మూడో టీ20 కు సంజుకు తుది జట్టులో స్థానం దక్కడం ఖాయం. వికెట్ కీపర్ ధృవ్ జురెల్ స్థానంలో అతను కీపింగ్ బాధ్యతలు స్వీకరిస్తాడు. 

తొలి మ్యాచ్ లో జురెల్ 14 బంతులాడి కేవలం 7 పరుగులే చేశాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో జురెల్ స్థానంలో సంజు రావడం దాదాపు ఖాయమైపోయింది. సాయి సుదర్శన్ స్థానంలో దూబే ఆడనున్నాడు. బౌలింగ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. బిష్ణోయ్, సుందర్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ స్థానాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఐదో బౌలర్ గా అభిషేక్ శర్మ, శివమ్ దూబే బాధ్యతలు పంచుకుంటారు. 

భారత్ తుది జట్టు అంచనా:

శుభమాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్) , రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ , రవి బిష్ణోయ్ , అవేష్ ఖాన్ , ముఖేష్ కుమార్.

జింబాబ్వే తుది జట్టు అంచనా:

వెస్లీ మాధేవెరే, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండింగ్ ముజరాబానీ.

Also Read:జోరు సాగాలె..నేడు జింబాబ్వేతో ఇండియా మూడో టీ20