IND vs ZIM: అంపైర్‌ను బెదిరించిన రవి బిష్ణోయ్.. దెబ్బకు క్షమాపణ చెప్పించాడు

IND vs ZIM: అంపైర్‌ను బెదిరించిన రవి బిష్ణోయ్.. దెబ్బకు క్షమాపణ చెప్పించాడు

తొలి టీ20 ఓటమికి యంగ్ ఇండియా బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే. సొమవారం(జులై 07) హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో గిల్ సేన.. 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 234 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఆతిథ్య జట్టు 134 పరుగులకే పరిమితమయ్యింది. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఈ మ్యాచ్‌లో ఒకానొక సంధర్భంలో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్.. అంపైర్‌ను భయపెట్టాడు. ఖచ్చితమైన నిర్ణయాలు ఇవ్వాల్సిన మ్యాచ్ పెద్ద(అంపైర్) తప్పుడు నిర్ణయం ఇవ్వగా.. ఇచ్చిన డెసిషన్‌ని మార్చుకుంటావా..! లేదా..! అని కంటి చూపుతో బెదిరించాడు. అతని దెబ్బకు అంపైర్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవడమే కాదు, క్షమాపణ కూడా కోరాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వైడ్ అంటావ్.. గుడ్ బాల్..!

జింబాబ్వే బ్యాటింగ్ 10వ ఓవర్‌లో బిష్ణోయ్ వేసిన ఒక బంతిని జొనాథన్ క్యాంప్‌బెల్‌ రివర్స్ స్వీప్ ఆడబోయాడు. బంతి బ్యాటర్‌కు ఎడమ వైపుకు వెళ్లగా.. అంపైర్ వైడ్ డెలివరీగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. వెంటనే బిష్ణోయ్.. అంపైర్ వైపు గుడ్లురిమి చూసి డెసిషన్ మార్చుకునేలా చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వాస్తవానికి బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడకపోయింటే.. ఆ నిర్ణయం సరైనదే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by cricket_9 (@cricket_97290)