జింబాబ్వే పర్యటనలో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు(శనివారం, జులై 13) భారత్, జింబాబ్వే జట్ల మధ్య నాలుగో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫ్రెష్ వికెట్‌లా కనిపిస్తుండంతో ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందేమో అన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
చెన్నై పేసర్ అరంగ్రేటం
ఈ మ్యాచ్ ద్వారా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే భారత జట్టు తరుపున ఆరగ్రేటం చేస్తున్నాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు, జింబాబ్వే వెల్లింగ్టన్ మసకద్జా స్థానంలో ఫరాజ్ అక్రమ్‌ను జట్టులోకి తీసుకుంది. కాగా, ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది.
Tushar Deshpande makes his T20I debut 🧢
— ESPNcricinfo (@ESPNcricinfo) July 13, 2024
Avesh Khan sits out as India opt to bowl first #ZIMvIND
👉https://t.co/kZ9Bgk5nPZ pic.twitter.com/l6kVAY22Kt
తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్,తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే: మారుమణి, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.