IND vs ZIM: జింబాబ్వేతో ఆఖరి టీ20.. టాస్ ఓడిన టీమిండియా

జింబాబ్వే పర్యటనను ఓటమితో ఆరంభించిన యువ భారత్‌.. తర్వాత వరుసగా మూడు విజయాలతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆఖరి టీ20లో తలపడేందుకు సిద్ధమైంది. ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం(జులై 14) ఐదో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో, టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

పరాగ్ ఎంట్రీ

ఈ మ్యాచ్ ద్వారా యువ బ్యాటర్, ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ అంతర్జాతీయ అరంగ్రేటం చేయనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారు.

తుది జట్లు

భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), అభిషేక్ శర్మ,  సంజూ శాంసన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్,తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్.

జింబాబ్వే: మారుమణి, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాండన్ మవుటా.