హరారే వేదికగా ఆదివారం (జూలై 14) భారత్, జింబాబ్వే జట్లు చివరిదైన ఐదో టీ20 లో తలపడనున్నాయి. శనివారం (జూలై 13) జరిగిన నాలుగో టీ20లో గిల్ సారధ్యంలోని యువ టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3-1 తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో చివరి వన్డే గెలిచి ఈ సిరీస్ కు భారత్ గొప్ప ముగింపు ఇవ్వాలని చూస్తుంటే.. ఆతిధ్య జింబాబ్వే జట్టు ఈ మ్యాచ్ లో పరువు కాపాడుకోవాలని భావిస్తుంది. సిరీస్ రావడంతో ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది.
తొలి టీ20 లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్ (2) వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ (7) విఫలమయ్యారు. రెండో టీ20 లో వీరు తుది జట్టులో అవకాశం దక్కించుకున్నా.. బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు. జైస్వాల్, సంజు శాంసన్, శివమ్ దూబే మూడో టీ20కి జట్టులో చేరడంతో పరాగ్, జురెల్ బెంచ్ కి పరిమితమయ్యారు. అయితే వీరికి 5వ టీ20లో మరో అవకాశం రానున్నట్టు సమాచారం. అదే జరిగితే జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్లు జైస్వాల్, గిల్ ఓపెనర్లుగా అదరగొడుతున్నారు. అభిషేక్ శర్మ, గైక్వాడ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. సంజు శాంసన్ కు బ్యాటింగ్ ప్రాక్టీస్ కాలేదు కాబట్టి మరో అవకాశం రావొచ్చు. దీంతో చివరి టీ20లో రింకూ సింగ్, శివమ్ దూబేలకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రయోగాలు ఏమీ చేయకపోతే నాలుగో టీ20 మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టే చివరి టీ20లోనూ కొనసాగించే అవకాశం ఉంది.
భారత్ తుది జట్టు అంచనా :
యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్‌పాండే
జింబాబ్వే తుది జట్టు అంచనా :
వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), ఫరాజ్ అక్రమ్, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా