విమెన్స్​ ఆసియా కప్​ మనదే ఫైనల్లో 41 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై గ్రాండ్ విక్టరీ

 విమెన్స్​ ఆసియా కప్​ మనదే ఫైనల్లో 41 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై గ్రాండ్ విక్టరీ

అండర్​ 19 విమెన్స్​ ఆసియా కప్​లో ఇండియా విజేతగా నిలిచింది. ఫైనల్​లో 41 రన్స్​ తేడాలో బంగ్లాదేశ్​పై గెలిచింది. హైదరాబాద్​ అమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​,  ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నీ అవార్డులు అందుకుంది.

  • అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌19 విమెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఇండియా 
  • జట్టును గెలిపించిన హైదరాబాదీ త్రిష


కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌: విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20 అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌  తొలి ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో  యంగ్ ఇండియా చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.  హైదరాబాద్ క్రికెటర్ గొంగడి త్రిష (47 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) అద్భుత హాఫ్ సెంచరీకి తోడు స్పిన్నర్  ఆయుషి శుక్లా (3/17) కూడా ఆకట్టుకోవడంతో ఆదివారం జరిగిన ఫైనల్లో  ఇండియా 41 రన్స్ తేడాతో  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది. తొలుత ఇండియా నిర్ణీత  20 ఓవర్లలో 117/7 స్కోరు చేసింది. మిగతా ప్లేయర్లు నిరాశ పరచగా ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రిష జట్టుకు మంచి  స్కోరు అందించింది. మరో ఓపెనర్ కమలిని (5)తో పాటు సైనికా చాల్కె (0), ఐశ్వరి అవసారె (5) ఫెయిలయ్యారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నిక్కి ప్రసాద్ (12), మిథిలా (17), ఆయుషి శుక్లా (10) డబుల్ డిజిట్‌‌‌‌‌‌‌‌ స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో ఫర్జానా ఇయాస్మిన్‌‌‌‌‌‌‌‌ నాలుగు, నిషితా అక్తర్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం  ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 18.3 ఓవర్లలో 76 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది.  జువైరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయ (18) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే వెనుదిరిగారు.  పరునికా, సోనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, ప్లేయర్ ఆఫ్ ద
 టోర్నమెంట్ అవార్డులు లభించాయి. 

బౌలర్ల జోరు

చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను ఇండియా బౌలర్లు విజయవంతంగా కాపాడుకున్నారు. ఆరంభం నుంచే ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ రెండో ఓవర్లోనే ఓపెనర్ మొసమ్మత్‌‌‌‌‌‌‌‌ ఇవా (0)ను డకౌట్ చేసిన  జోషితా తొలి దెబ్బ కొట్టగా.. ఐదో ఓవర్లో సుమైయా (8)ను పరునికా ఎల్బీ చేసింది. ఈ టైమ్‌లో జువైరియా వరుస బౌండ్రీలో ఎదురుదాడికి దిగింది. కానీ,  ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫహోమిదా, కెప్టెన్  సుమైయా అక్తర్ (4)సోనమ్ వెనక్కుపంపింది. ఆపై, స్పిన్నర్ ఆయుషి శుక్లా ఒక్కసారిగా విజృంభించింది. క్రీజులో నిలదొక్కుకున్న జువైరియాను 15వ ఓవర్లో  బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసింది. తన తర్వాతి ఓవర్లోనే హబీబా (1) హిట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌గా ఔటవ్వగా..  జనాటుల్ (3) రనౌట్‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగింది.  మధ్యలో సాదియా అక్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7)ను పరునికా వెనక్కు పంపింది. నిషిత (1) రనౌటవ్వగా...  ఆయుషి బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో అనిసా (0) స్టంపౌట్‌‌‌‌‌‌‌‌ అవ్వడంతో బంగ్లా పోరాటం ముగిసింది. 
సంక్షిప్త స్కోర్లు: ఇండియా: 20 ఓవర్లలో 117/7 (త్రిష 52, మిథిలా 17, ఫర్జానా 4/31). బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌: 18.3 ఓవర్లలో 76 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (జువైరియా 22, ఆయుషి 3/17).

ఆదుకున్న త్రిష

సవాల్‌‌‌‌‌‌‌‌ విసిరిన వికెట్‌‌‌‌‌‌‌‌పై  టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడింది. అయితే, తన ఫామ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తూ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రిష జట్టును ఆదుకుంది. నిషి వేసిన రెండో ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌, అనిసా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో త్రిష టచ్‌‌‌‌‌‌‌‌లోకి రాగా.. ఐదో ఓవర్లో మరో ఓపెనర్ కమలిని, సైనికా చాల్కెను ఔట్ చేసిన ఫర్జానా ఇండియాకు డబుల్ షాకిచ్చింది.  ఈ దశలో కెప్టెన్ నిక్కి ప్రసాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 41 రన్స్ జోడించిన హైదరాబాద్ అమ్మాయి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దింది. ఈక్రమంలో త్రిష ముచ్చటైన షాట్లతో ఆకట్టుకుంది. అయితే, 12వ ఓవర్లో నిక్కిని బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసిన హబీబా ఈ జోడీని విడదీసింది. అయినా వెనక్కు తగ్గని త్రిష.. నిషి బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టి 43 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. కానీ, అదే ఓవర్లో ఐశ్వరి స్టంపౌట్‌‌‌‌‌‌‌‌ అయింది. కాసేపటికే ఫర్జానా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో త్రిష వెనుదిరగడంతో ఇండియా 84/5తో నిలిచింది. స్లాగ్‌‌‌‌‌‌‌‌ ఓవర్లలో మిథిలా, ఆయుషి ఒక్కో పరుగు జత చేసి స్కోరు వంద దాటించారు. ఫర్జానా వేసిన చివరి ఓవర్లో మిథిలా రెండు ఫోర్లు కొట్టి ఔటవగా.. ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌కు షబ్నమ్ (4 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.