ఫేవరెట్‌‌గా ఇండియా ..ఇవాళ(జనవరి 31) ఇంగ్లండ్‌‌తో సెమీస్‌‌ పోరు

ఫేవరెట్‌‌గా ఇండియా ..ఇవాళ(జనవరి 31) ఇంగ్లండ్‌‌తో సెమీస్‌‌ పోరు

కౌలాలంపూర్‌‌: వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌.. అండర్‌‌–19 వరల్డ్‌‌ కప్‌‌లో సెమీస్ మ్యాచ్‌‌కు రెడీ అయ్యింది. శుక్రవారం ఇంగ్లండ్‌‌తో జరిగే ఈ మ్యాచ్‌‌లో నెగ్గి వరుసగా రెండోసారి ఫైనల్లో చోటు సంపాదించాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇప్పటికే మలేసియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌‌, స్కాట్లాండ్‌‌ను ఓడించిన ఇండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. 

సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న తెలంగాణ బ్యాటర్‌‌ గొంగడి త్రిషకు తోడుగా కమలిని కూడా చెలరేగితే మళ్లీ భారీ స్కోరును ఆశించొచ్చు. ఇక బౌలింగ్‌‌లో వైష్ణవి శర్మ (12 వికెట్లు), ఆయుషి శుక్లా (10)కు తోడుగా త్రిష కూడా రాణిస్తుండటం కాన్ఫిడెన్స్‌‌ పెంచే అంశం. మరోవైపు గత ఫైనల్లో ఇండియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్‌‌ భావిస్తోంది. ఆ టీమ్ బ్యాటర్ డేవినా పెర్రిన్‌‌పై మంచి ఫామ్‌‌లో ఉంది. కానీ, బౌలర్లు పెద్దగా రాణించలేకపోతున్నారు. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో  సౌతాఫ్రికా పోటీపడనుంది.