
జన్నారం, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు. గత వారం క్రితం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ ఆఫీసర్లు మాత్రం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా పోసి పడిగాపులు కాస్తున్నామని.. మరోవైపు మబ్బులు కమ్ముకొస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వరంగల్ బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇటు వైపుగా వచ్చిన ఆదిలాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ రైతులకు మద్దుతుగా కొద్దిసేపు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ విషయంపై పొనకల్ సహకార సంఘం సీఈవో కావటి రాజన్నను సంప్రదించగా.. కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడం లేట్ అయ్యిందని, సోమవారం నుంచి కొనుగోలు చేస్తామని తెలిపారు.