
జైపూర్, వెలుగు: ఇందారం ఓపెన్‌కాస్ట్‌లో ఈ ఏడాది 15 లక్షల టన్నుల బొగ్గును తీయాలని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్ కాస్ట్‌ను ఏరియా జీఎం శ్రీనివాస్ తో కలిసి ఆయన పరీశిలించారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యం 15 లక్షల టన్నుల బొగ్గును తీయాలన్నారు. లక్ష్యాల సాధనకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఓసీకి కావాల్సిన యంత్రాలు, సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు.
ప్రతి నెలా ఓబీ ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని, యంత్రాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని వరాహ ఓబీ కాంట్రాక్ట్ ప్రతినిధులకు సూచించారు. ‘సింగరేణి నీటిబిందువు జల సింధువు’ కార్యక్రమంలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న నీటి కుంట ప్రదేశాన్ని పరిశీలించారు. ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, పీవో వెంకటేశ్వర్ రెడ్డి, గని మేనేజర్ రవి కుమార్, ప్రాజెక్ట్ ఇంజనీర్ రామకృష్ణ రావు, వరాహ కాంట్రాక్ట్ కంపనీ ప్రతినిధులు పాల్గొన్నారు.