మహిళలతో అసభ్య ప్రవర్తన..996 ఆకతాయిలు అరెస్ట్

మహిళలతో అసభ్య ప్రవర్తన..996 ఆకతాయిలు అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: గణపతి నవరాత్రుల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 996 మందిని షీ టీమ్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖైరతాబాద్ బడా గణపతి వద్ద క్యూ లైన్ లో నిల్చున్న మహిళలు, యువతులను ఏ విధంగా వేధించారో వీడియో రికార్డ్ చేశారు. వారందరిపై కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చారు.