తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మె బాట

నిజామాబాద్ సిటీ, వెలుగు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ 25 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు శామంతి నవీన్, చొక్కాల రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యానికి ఏప్రిల్ 6న తమ యూనియన్ తరఫున సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 24 వరకు చర్చలకు పిలిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో 25 నుంచి రాష్ట్రంలోని జెన్ కో, ట్రాన్స్​కో, ఎన్ పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, ఆర్టిజన్లు సమ్మెలోకి వెళ్తాయని అన్నారు.