స్వాతంత్ర్య దినోత్సవం : ఈ రోజున పిల్లలతో కలిసి చేయాల్సిన ఫ్రెండ్లీ యాక్టివిటీస్

స్వాతంత్ర్య దినోత్సవం : ఈ రోజున పిల్లలతో కలిసి చేయాల్సిన ఫ్రెండ్లీ యాక్టివిటీస్

రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన తర్వాత ఆగస్ట్ 15, 1947న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న, భారతదేశం ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని గొప్పగా, వైభవంగా  జరుపుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతిబింబించే రోజుగా ఈ రోజును పరిగణిస్తారు, చరిత్రను తిరిగి చూసుకోవడం, మనకు లభించిన స్వాతంత్ర్యాన్ని అభినందించడం ఈ రోజు ప్రత్యేకత.

ప్రతి సంవత్సరం, పాఠశాలల నుంచి కళాశాలల నుంచి కార్యాలయాల వరకు అనేక ప్రాంతాల్లో దేశభక్తి నేపథ్య కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత జెండాను ఎగురవేసి దేశభక్తి గీతాలు ఆలపిస్తారు. చిన్నతనం నుంచే పిల్లలలో దేశం పట్ల ప్రేమ, స్వేచ్ఛ ప్రాముఖ్యతను పెంపొందించడం చాలా అవసరం. ఈ చిరస్మరణీయమైన రోజున మీ పిల్లలతో కలిసి చేసే కొన్ని కార్యకలాపాలేంటో ఇప్పుడు చూద్దాం.

పిల్లలతో చేయాల్సిన సరదా కార్యకలాపాలు

జెండా ఎగురవేయడం

జాతీయ గీతం ప్లే చేయగానే భారత జెండాను పరిసరాలు, పాఠశాలలు, ఇంటి డాబాలపై కూడా ఎగురవేస్తారు. ఈ రోజున, మీరు కూడా మీ పిల్లలతో కలిసి జెండాను మీ ఇంటి పక్కన ఎగురవేయవచ్చు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని చూసిన గర్వం వల్ల అనుభూతి వారికి కూడా తెలిసేలా చేయొచ్చు. అలా వారితో జాతీయ గీతం ఆలపించి, అందరితో విధేయత ప్రమాణం చెప్పించండి.

పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలు

ఈ సరదా పోటీలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి, పిల్లల సృజనాత్మకతను వెలికితీసేందుకు అద్భుతమైన పద్ధతిగా కూడా చెప్పవచ్చు. కాబట్టి స్వాతంత్ర్య దినోత్సవ నేపథ్య డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించవచ్చు. స్వేచ్ఛ భావనను నొక్కి చెప్పే అంశాలను పరిగణించండి. రంగుల ద్వారా తమను తాము వ్యక్తీకరించడానికి ప్రోత్సహించండి. దేశభక్తిని వ్యక్తీకరించడానికి ఫేస్ పెయింటింగ్ మరొక అద్భుతమైన పద్ధతి.

కల్చరల్ డ్యాన్స్

డ్యాన్స్ అనేది దేశభక్తిని వ్యక్తీకరించడానికి, అనేక సాంస్కృతిక నేపథ్యాల నుంచి పిల్లలను ఒకచోట చేర్చడానికి ఇది ఉత్తమమైన మార్గం. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే అనేక డ్యాన్స్ ఈవెంట్‌లలో మీ చిన్నారి కూడా పాల్గొనవచ్చు. పిల్లలకు సరైన స్టెప్స్ ను ముందుగానే నేర్పడానికి ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ను ఏర్పాటు చేయండి. కథక్, భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, మణిపురి లాంటి ఇతర భారతీయ నృత్య రీతులను కూడా ఇందులో ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. ఈ అభ్యాసం సాంస్కృతిక భిన్నత్వంలో ఏకత్వాన్ని నొక్కి చెబుతుంది.

మంగళ్ పాండే నుంచి మదర్ ఇండియా వరకు సినిమాలు

స్వాతంత్య్రాన్ని పొందేందుకు సాగిన పోరాటాన్ని చూపే దేశభక్తి చిత్రాలను కూడా పిల్లలకు చూపించవచ్చు. దీని వల్ల దేశం కోసం పోరాడిన వారి గురించి తెలియని విషయాలను దృశ్యరూపంలో చూపించే అవకాశం ఉంటుంది.