ఎర్రకోట చుట్టూ ఆంక్షలు.. నో ఎంట్రీ అంటున్న పోలీసులు

ఎర్రకోట చుట్టూ ఆంక్షలు.. నో ఎంట్రీ అంటున్న పోలీసులు

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున పోలీసు శాఖ దేశ వ్యాప్తంగా తనిఖీలు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. రాజ్‌ఘాట్, ITO, ఎర్రకోట వంటి ప్రసిద్ద ప్రాంతాల సమీపంలో సీఆర్పీసీ (CrPC) సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు తెలిపారు. ఇక దేశం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎర్రకోట నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

పారా-గ్లైడర్ల ఎగురవేయడంపై నిషేధం:

భద్రతా కారణాల దృష్ట్యా జూలై 22 నుంచి ఆగస్టు 16 వరకు దేశ రాజధానిలో పారాగ్లైడర్లు, హ్యాంగ్-గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్‌లు వంటి వైమానిక ప్లాట్‌ఫారమ్‌లను ఎగురవేయడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.