జైలులో ఉన్నా ఎంపీగా విజయం

జైలులో ఉన్నా ఎంపీగా విజయం

పంజాబ్ రాష్ట్రంలో ఏర్పాటువాది అమృత్ పాల్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో  ఖదూర్ సాహిబ్ లోక్ సభ స్థానం గెలిచారు. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లక్షా 78 వేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుల్బీర్ సింగ్ పై విజయం సాధించారు. ఏర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్థాన్ కోసం అమృత్ పాల్ సింగ్ ఉద్యమం చేస్తున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖదూర్ సాహిబ్ నుంచి అమృతపాల్ సింగ్, కుల్బీర్ సింగ్ జిరాలతో పాటు అకాలీదళ్‌కు చెందిన విర్సా సింగ్ వాల్తోహా, ఆప్‌కి చెందిన లాల్‌జిత్ సింగ్ భుల్లర్ పోటీ పడ్డారు.