మద్యం, డబ్బులకు లొంగకుండా నిజాయితిగా ఓటు వేసి.. సరైన అభ్యర్థిని ఎంచుకోవాలని జగిత్యాల జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం నిర్వహించాడు. ధర్మపురి పట్టణంలో స్వతంత్ర అభ్యర్థి మోతే నరేష్ బీర్, లిక్కర్ బాటిళ్లతో.. చిరిగిన బట్టలు వేసుకొని వినూత్నంగా ప్రచారం చేశాడు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ఇచ్చే డబ్బు, మద్యానికి లొంగకుండా నిజాయితిగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల గురించి ఆలోచించి.. ఓటు వేయాలని గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేపట్టాడు.
ప్రలోభాలకు లోనై టప్పటడుగు వస్తే.. ఐదు సంవల్సరాలు బానిసలా బతుకుతమని సూచించారు. ఇప్పటికే విద్యా, వైద్యం, ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని.. ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తూ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతుందని విమర్శించారు. అందుకే ఈ ఎన్నికల సమయంలోనైనా ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
తన గుర్తు రోడ్డు రోలర్ గుర్తని.. ఎన్నికల సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే మంచి అభ్యర్థినిఎంచుకొని ఓటు వేయాలని మోతే నరేష్ ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో తానుగాడిద పై వచ్చి నామినేషన్ వేశానని తెలిపాడు నరేష్.