అధికార పార్టీకి ఇండిపెండెంట్ల టెన్షన్

అధికార పార్టీకి ఇండిపెండెంట్ల టెన్షన్

138 డివిజన్ల నుంచి 415 మంది పోటీ

వెనక్కి తగ్గాలంటూ ఒత్తిడి.. వినిపించుకోని ఇండిపెండెంట్లు..

సర్కారు, సిట్టింగ్​ల వైఫల్యాలే అజెండాగా ప్రచారం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ఎన్నికల్లో ఈసారి 150 డివిజన్లలో 1,122 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ 150 డివిజన్లలో పోటీ చేస్తుండగా, బీజేపీ నవాబ్ సాహెబ్ కుంట మినహా  అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. తలాబ్​ చంచలం, గోల్కొండ, టోలిచౌకీ, బార్కాస్  నాలుగు ప్రాంతాల్లో మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్​క్యాండిడేట్లను బరిలో నిలిపింది. ఇండిపెండెంట్లు 415 మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేసి బీ ఫాం సమర్పించని వారిని కూడా ఇండిపెండెంట్లుగా గుర్తించారు. జంగమ్మెట్​ డివిజన్ లో మొత్తం 20 మంది బరిలో ఉండగా అత్యధికంగా13 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా ఉప్పల్‌,  టోలీచౌక్‌, జీడిమెట్ల, బార్కాస్‌, నవాబ్‌సాహెబ్‌కుంట వార్డుల్లో ముగ్గురు అభ్యర్థుల చొప్పున పోటీ చేస్తున్నారు. ప్రధానంగా 18 డివిజన్లలో ఎక్కువ సంఖ్యల్లో ఇండిపెండెంట్అభ్యర్థులు బరిలో ఉన్నారు.

గట్టి పోటీ ఇస్తున్నరు

ప్రస్తుతం పోటీలో ఉన్న ఇండిపెండెంట్​క్యాండిడేట్లలో చదువుకున్నవారు, అందులోనూ యువత ఎక్కువగా ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు లభించకపోవడంతో కొందరు రెబల్స్​గా బరిలో దిగారు. ఇలా దాదాపు 30 మంది వరకు పోటీలో ఉన్నారు. కొన్ని డివిజన్లలో ఇండిపెండెంట్లు సైలెంట్​గా ఉండాలంటూ వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఏకంగా డబ్బు ఆశ చూపుతున్నారు. అయితే ఇండిపెండెంట్లు మాత్రం అవన్నీ వద్దంటూ ప్రజాక్షేత్రంలో పోటీ పడదామంటూ సవాల్ విసురుతున్నారు.

అధికార పార్టీ తప్పులు జనానికి వివరిస్తూ..

పలు డివిజన్లలో అధికార పార్టీకి ఇండిపెండెంట్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నామినేషన్లు వేసినప్పటి నుంచి విత్​డ్రా టైం వరకు వారిని పోటీ నుంచి తప్పించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించినా వినిపించుకోలేదు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని ఇతరులకు టికెట్లు ఇచ్చారని, ఆ అభ్యర్థిని ఓడించే తీరుతామని తెగేసి చెబుతున్నారు. దీంతో టీఆర్ఎస్​ నేతల్లో గుబులు పట్టుకుంది. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు కూడా జోరు పెంచడం వారిని మరింత టెన్షన్ ​పెడుతోంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ప్రధానంగా అధికార పార్టీ చేసిన తప్పులనే ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. సిట్టింగ్​కార్పొరేటర్ల వైఫల్యాలను అందరికీ వివరిస్తున్నారు. దీంతో తమకు వచ్చే ఓట్లలో ఏ కొన్ని ఓట్లు ఇండిపెండెంట్లకు పడ్డా చివరకు గెలుపు కష్టమవుతుందన్న టెన్షన్​లో టీఆర్ఎస్​ క్యాండిడేట్లు పడ్డారు.

For More News..

ఇవ్వాల ఉన్నం.. రేపు ఉంటమో లేదో.. దోస్త్​కు మెసేజ్‌ చేసిన తెల్లారే టెర్రరిస్టుల దాడిలో సోల్జర్ మృతి

రోహిత్‌‌ అందుకే ఆసీస్‌‌ వెళ్లలేదు

ఒక్క చాన్స్​ ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం

హర్షద్ మెహతా వెబ్‌‌ సిరీస్‌‌తో పెరిగిన ఓటీటీ యూజర్లు