రికార్డు లెవెల్లో ముగిసిన ఇండెక్స్​లు

ముంబై : పీఎస్‌‌‌‌‌‌‌‌యూ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు,  తాజా విదేశీ నిధుల ప్రవాహాల నేపథ్యంలో సోమవారం ఇండెక్స్​లు కొత్త రికార్డు గరిష్ట స్థాయుల్లో ముగిశాయి.  30 షేర్ల బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్ 145.52 పాయింట్లు పెరిగి 80,664.86 వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఇంట్రాడేలో ఇది 343.2 పాయింట్లు ఎగిసి 80,862.54 గరిష్ట స్థాయిని తాకింది.  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 84.55 పాయింట్లు పుంజుకుని ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్ క్లోజింగ్ హై 24,586.70 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 132.9 పాయింట్లు పెరిగి కొత్త రికార్డు గరిష్ట స్థాయి 24,635.05ను తాకింది.

  సెన్సెక్స్ షేర్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా లాభపడింది. ఎంసీఎల్​ఆర్​ ఆధారిత లోన్ల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటించిన తర్వాత 2.55 శాతం పెరిగింది. దీంతోపాటు ఎన్టీపీసీ, అల్ట్రాటెక్  , మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, మారుతీ, ఐటీసీ లాభపడ్డాయి.  అయితే, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్​నష్టపోయాయి.

ALSO READ : తెలంగాణ మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ బ్లాక్​ ఎడిషన్​ 

 బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.95 శాతం  స్మాల్‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం పెరిగింది.   ఇండస్ట్రియల్​, ఐటీ, టెక్‌‌‌‌‌‌‌‌, క్యాపిటల్‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌‌‌‌‌ మినహా మిగతా సూచీలన్నీ లాభపడ్డాయి.   ఆసియా మార్కెట్లలో, సియోల్  షాంఘై లాభాల్లో స్థిరపడగా, హాంకాంగ్ నష్టాల్లో ముగిసింది. యూరప్ మార్కెట్లు దిగువన ట్రేడవుతున్నాయి.