ముంబై: ఇండెక్స్ హెవీ వెయిట్స్స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి, బలహీనమైన గ్లోబల్ ట్రెండ్స్ కారణంగా సెన్సెక్స్ సోమవారం 451 పాయింట్లు నష్టపోయి 78,248 పాయింట్ల వద్ద ముగిసింది. మధ్యాహ్నం లాభాల్లోకి వెళ్లినా అమ్మకాల ఒత్తిడి వల్ల తిరిగి నష్టాల్లోకి జారుకుంది. సెన్సెక్స్ప్యాక్లో 23 షేర్లు నష్టాల పాలయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 169 పాయింట్లు కోల్పోయి 23,644.90 వద్ద ముగిసింది.
సెన్సెక్స్షేర్లలో టాటా మోటార్స్, టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, మహీంద్రా అండ్మహీంద్రా, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, మారుతి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రియలన్స్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. జొమాటో, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్, ఇండస్‌ఇండ్‌బ్యాంక్ లాభపడ్డాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లలో హెల్త్‌కేర్, ఐటీ, టెల్కో, బీఎస్ఈ ఐటీ మాత్రమే లాభపడ్డాయి. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.1,323 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. ఆసియాలో సియో, టోక్యో, హాంకాంగ్మార్కెట్లు నష్టపోయాయి.