భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా చివరిదైన ఐదో టెస్టుకు టీమిండియా స్క్వాడ్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించగా.. కొత్త ప్లేయర్లకు అవకాశం దక్కలేదు. రాంచీ టెస్టుకు దూరమైన బుమ్రా ధర్మశాలలో మార్చ్ 7 నుంచి 11 వరకు జరిగే ఐదో టెస్టుకు జట్టులో చేరాడు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకొని కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయలేదు.
పటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్‌కు ధర్మశాల టెస్ట్ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వవచ్చని బీసీసీఐ వర్గాలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరీస్ లో అందరూ ఆకట్టుకుంటున్నా.. రజత్ పటిదార్ మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. కోహ్లీ, రాహుల్ గాయాలతో లక్కీగా జట్టులో చోటు దక్కించుకున్న ఈ మధ్య ప్రదేశ్ ఆటగాడు ఆడిన మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ ల్లో 63 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు పడికల్ దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు.
ALSO READ :- తుమ్మడిహెట్టి దగ్గర నీళ్లు లేవని BRS తప్పుడు ప్రచారం చేసింది: జలశక్తి శాఖ సలహాదారు
ఈ సిరీస్ లో భాగంగా భారత్ హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయింది. అయితే ఆ తర్వాత అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. వైజాగ్, రాజ్ కోట్, రాంచీ టెస్టులో గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ లతో భారత్ ఆటగాళ్లు బిజీగా మారనున్నారు.
5 వ టెస్టుకు భారత జట్టు
రోహిత్ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), జైస్వాల్, గిల్, పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కేపీఆర్ ), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.
India's 🇮🇳Squad for the 5th Test against🏴 England in Dharamshala.🏏#CricOval #INDvENG #India #TestCricket #Test #WTC25 #TeamIndia #IndianCricketTeam #RohitSharma #Cricket #Dharamshala pic.twitter.com/BXrlZHvqsy
— CricOval (@cric0val) February 29, 2024