వజ్ర ప్రహార్ పేరిట భారత్, అమెరికాల ప్రత్యేక బలగాల ఉమ్మడి యుద్ధ విన్యాసాల 15వ ఎడిషన్ అక్టోబర్ 2 నుంచి 22 వరకు అమెరికాలోని ఇదాహోలోని ఆర్చర్డ్ కంబాట్ ట్రైనింగ్ సెంటర్ వేదికగా జరిగాయి. ఈ యుద్ధ విన్యాసాల్లో రెండు దేశాల బలగాలు తమ అనుభవాలు, అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకోనున్నాయి. ఇరుపక్షాల సైనికుల మధ్య సమన్వయానికి ఇవి తోడ్పడుతాయి. రెండు దేశాల తరఫున 45 మంది సైనికుల చొప్పున పాల్గొన్నారు.
వజ్రప్రహార్ విన్యాసాలు చివరిసారిగా 2023, డిసెంబర్లో మేఘాలయాలో జరిగాయి. ఈ ఏడాది భారత్, అమెరికా సైనికుల మధ్య జరిగిన రెండో యుద్ధ విన్యాసాలు ఇవి. సెప్టెంబర్లో రాజస్థాన్లో యుద్ధ అభ్యాస్ పేరిట ఉమ్మడి విన్యాసాలు జరిగాయి.