
జొహార్ బారు (మలేసియా) : సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్‌లో ఇండియా హాకీ టీమ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా 0–4తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. అయినప్పటికీ ఇండియా 9 పాయింట్లతో టాప్ ప్లేస్‌లోనే కొనసాగుతుండగా, న్యూజిలాండ్ (8), ఆసీస్ (7) వరుసగా రెండు, మూడు ప్లేస్‌ల్లో ఉన్నాయి. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో డెకిన్ స్టాంజెర్ (33, 39, 53వ ని) హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు.
ప్యాట్రిక్ ఆండ్రూ (29వ ని) ఆసీస్‌కు ఓ గోల్ అందించాడు. కంగారూలు వరుస విరామాల్లో గోల్స్ చేసే అవకాశాలను సృష్టించుకున్నారు. వీటికి అడ్డుకట్ట వేయడంలో ఇండియా డిఫెన్స్ విఫలమైంది. శుక్రవారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇండియా కుర్రాళ్లు పోటీపడనున్నారు.