తొలిసారిగా 10 ఆఫ్రికన్ దేశాలతో భారత నేవీ విన్యాసాలు

తొలిసారిగా 10 ఆఫ్రికన్ దేశాలతో  భారత  నేవీ విన్యాసాలు

ఆఫ్రికా– ఇండియా కీ మారిటైమ్​ ఎంగేజ్​మెంట్(ఐక్యమే–ఏఐకేఈవైఎంఈ) పేరుతో తొలిసారిగా ఆఫ్రికన్ దేశాలతో భారత నావికాదళం సంయుక్తంగా బహుపాక్షిక నౌకాదళ విన్యాసాలను ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించనున్నది. ఐక్యమే అంటే సంస్కృతంలో ఐక్యత అని అర్థం.

ప్రధాన లక్ష్యం

    ఈ విన్యాసాల్లో పాల్గొనే దేశాల నావికాదళాలు, మారిటైమ్​ ఏజెన్సీల( సముద్ర సంస్థలు) మధ్య పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం. 

  • భారతదేశం, ఆఫ్రికా దేశాల మధ్య సముద్ర భద్రతను, మెరుగైన సమాచార భాగస్వామ్యం, నిఘా, పర్యవేక్షణ ద్వారా పైరసీ, అక్రమ రవాణా క్రమబద్ధీకరించడం, అక్రమ చేపల వేటను అరికట్టడం.
  •  తొలి ఎడిషన్​ విన్యాసాలను భారత నావికాదళం, టాంజానియా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్(టీపీడీఎఫ్) సంయుక్తంగా టాంజానియాలోని దార్ ఎస్ సలామ్​లో నిర్వహిస్తున్నాయి. 
  • ఆరు రోజులపాటు జరిగే విన్యాసాల్లో భారతదేశం, టాంజానియాతోపాటు కొమొరోస్, డిజిబౌటి, ఎరిత్రియా, కెన్యా, మడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, సీషెల్స్, దక్షిణాఫ్రికా దేశాలు పాల్గొననున్నాయి. ఈ విన్యాసాలను ద్వైవార్షికంగా నిర్వహిస్తున్నారు. ఈసారి తూర్పు ఆఫ్రికా దేశాలు పాల్గొననుండగా, రెండో ఎడిషన్​లో పశ్చిమ ఆఫ్రికా దేశాలు పాల్గొననున్నాయి. 
  • రెండు దశల్లో విన్యాసాలు: హార్బర్, సముద్ర దశలు.
  • హార్బర్ దశలో పైరసీ, సమాచార భాగస్వామ్యంపై దృష్టి సారించిన టేబుల్ టాప్, కమాండ్ పోస్ట్ విన్యాసాలు, సీమాన్ షిప్, విజిట్, బోర్డ్, సెర్చ్ సీజర్ కార్యకలాపాలపై శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి. 
  • సముద్ర దశలో సీమాన్ షిప్ పరిణామాలు, సెర్చ్ అండ్​ రెస్క్యూ(ఎస్ఏఆర్), వీబీఎస్ఎస్ విన్యాసాలు, ఇతర కార్యకలాపాలు ఉంటాయి.

ALSO READ | గౌతమ బుద్ధుడి జీవిత ఘట్టాలు..పంచకళ్యాణాలు అంటే ఏంటి.?