ఇంగ్లాండ్ తో తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. వికెట్ నష్టానికి 119 పరుగులతో రెండో రోజు రోజును ప్రారంభించిన రోహిత్ సేన.. మ్యాచ్ పై పట్టు బిగిస్తుంది. రెండో రోజు తొలి సెషన్ ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. రాహుల్ (55) శ్రేయాస్ అయ్యర్(34) క్రీజ్ లో ఉన్నారు. ఈ సెషన్ లో భారత్ మొత్తం 103 పరుగులు రాబట్టగా.. మరో 24 పరుగులు వెనకపడి ఉంది.
రెండో రోజు ప్రారంభంలో భారత్ జైస్వాల్ వికెట్ ను కోల్పోయింది. పార్ట్ టైం బౌలర్ రూట్ బౌలింగ్ లో స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత రాహుల్ తో కలిసి గిల్ 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఉన్నంత సేపు ఆచితూచి బ్యాటింగ్ చేసిన గిల్.. 23 పరుగుల వద్ద హార్ట్లీ బౌలింగ్ లో ఔటయ్యాడు. మ్యాచ్ ఆసక్తికరంగా మారుతున్న సమయంలో అయ్యర్ తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా నాలుగో వికెట్ కు అజేయంగా 63 పరుగులు జోడించారు.
గురువారం మొదలైన తొలి మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ 64.3 ఓవర్లలో 246 రన్స్‌కు ఆలౌటైంది. హిట్ పెయిర్ అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను తిప్పేశారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (88 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) ఒక్కడే ఫిఫ్టీతో సత్తా చాటాడు. జానీ బెయిర్ స్టో (37), బెన్ డకెట్ (35) ఫర్వాలేదనిపించారు. అక్షర్ పటేల్, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా తొలి రోజు చివరకు 23 ఓవర్లలో 119/1 స్కోరు చేసింది.
India vs England, 1st Test#INDvENG #TeamIndia @IDFCFIRSTBank
— Crickskills (@priyansh1604) January 26, 2024
?DAY 2 LUNCH?
ENGLAND ???????:- 2️⃣4️⃣6️⃣
INDIA ??:- 2️⃣2️⃣2️⃣/3️⃣ (50 overs)
KL RAHUL-55*(78)
SHREYAS IYER-34*(57)
INDIA TRAIL BY 2️⃣4️⃣ RUNS pic.twitter.com/Y9e4E2RdDT