సిరీస్‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి .. ఇయ్యాల (డిసెంబర్ 19న) సౌతాఫ్రికాతో రెండో వన్డే

సిరీస్‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి .. ఇయ్యాల (డిసెంబర్ 19న) సౌతాఫ్రికాతో రెండో వన్డే
  • తుది జట్టులోకి రజత్ పటీదార్!
  • సా. 4.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌లో 

గెబెహా (సౌతాఫ్రికా) : సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో  తొలి వన్డేలో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ అదే జోరు చూపెట్టి సిరీస్‌‌ నెగ్గాలని ఆశిస్తోంది. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్ కెప్టెన్సీలో గతేడాది సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌లో 0–3తో ఎదురైన వైట్‌‌‌‌‌‌‌‌వాష్‌‌‌‌‌‌‌‌కు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అదే సమయంలో మరికొందరు కుర్రాళ్లను కూడా పరీక్షించనుంది. శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ సిరీస్‌‌‌‌‌‌‌‌కు సన్నద్ధం అయ్యేందుకు టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లో చేరాడు. ఖాళీ అయిన అతని స్థానంలో వన్డే అరంగేట్రం కోసం టాలెంటెడ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజత్ పటీదార్, టీ20 హిట్టర్  రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడుతున్నారు.

టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో  ప్రతి మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో కొత్త అభిమానులను సంపాదించుకుంటున్న లెఫ్టాండర్ రింకూను వన్డేల్లో చూడాలని క్రికెట్ ప్రపంచం కోరుకుంటోంది.  ఎక్కువ బౌన్స్‌‌‌‌‌‌‌‌ లభించే సౌతాఫ్రికా పిచ్‌‌‌‌‌‌‌‌లపై సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయ్యే టెక్నిక్, టెంపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తనలో ఉందని రింకూ టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో నిరూపించాడు. అయితే, టీమిండియా మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లకు నిర్దిష్టమైన పనిని అప్పగిస్తోంది. రింకూను ఆరో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫినిషర్‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తుండగా, 30 ఏళ్ల పటీదార్ మధ్యప్రదేశ్ తరఫున నాలుగో నంబర్ స్పెషలిస్ట్‌‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో రైట్ హ్యాండ్ బ్యాటర్ అయ్యర్ స్థానంలో పటీదార్ బరిలోకి దిగే చాన్సుంది. ప్రస్తుతం ఆరో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌ బరిలో ఉన్నాడు.

తొలి వన్డేలో బ్యాటింగ్ చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ రాలేదు కాబట్టి సంజూను కొనసాగించే చాన్సుంది. ఒకవేళ రజత్‌‌‌‌‌‌‌‌తో పాటు రింకూ కూడా తుది జట్టులో ఉండాలంటే గత పోరులో నిరాశ పరిచిన లెఫ్టాండర్ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మను తప్పించాల్సి ఉంటుంది. కానీ, తన టాలెంట్‌‌‌‌‌‌‌‌ ప్రూవ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని చూస్తున్న హైదరాబాద్ యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేటు వేయడం  ప్రస్తుతానికి లాజికల్‌‌‌‌‌‌‌‌గా అనిపించడం లేదు. ఇక  అరంగేట్రం వన్డేలోనే హాఫ్​ సెంచరీ చేసిన లెఫ్టాండ్ ఓపెనర్ సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ తనకు మంచి ఫ్యూచర్ ఉందని నిరూపించుకున్నాడు. గత పోరులో నిరాశ పరిచిన రుతురాజ్‌‌‌‌‌‌‌‌పై ఇప్పుడు కాస్త ఒత్తిడి ఉంది.

జొహనెస్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌లో సఫారీ బ్యాటర్లను వణికించిన అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌, అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ అదే జోరు కొనసాగిస్తే  ఇండియా సిరీస్‌‌‌‌‌‌‌‌ నెగ్గడం పెద్ద కష్టం కాబోదు.  ఒకవేళ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ను మార్చాలనుకుంటే  తొలి వన్డేలో వికెట్‌‌‌‌‌‌‌‌ తీయలేకపోయిన పేసర్ ముకేశ్‌‌‌‌‌‌‌‌ స్థానంలో యంగ్ స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌కు అరంగేట్రం అవకాశం ఇవ్వొచ్చు. స్పినర్లలో అక్షర్, కుల్దీప్ ఇద్దరూ టెస్టు జట్టులో లేరు.

ఇద్దరిలో ఒకరు రెస్ట్‌‌‌‌‌‌‌‌ కోరితే యుజ్వేంద్ర చహల్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దింపొచ్చు. మరోవైపు  క్వింటన్ డికాక్ రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఈ సిరీస్ సఫారీ బ్యాటర్లకు సవాల్‌‌‌‌‌‌‌‌గా మారింది. తొలి వన్డేలో పూర్తిగా తేలిపోయిన బ్యాటర్లు వెంటనే పుంజుకుంటేనే ఆతిథ్య జట్టు సిరీస్‌‌‌‌‌‌‌‌లో నిలుస్తుంది.