భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న రాంచీ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ భారత్ ను గట్టెక్కించాడు. ఒంటరి పోరాటం చేస్తూ టీమిండియాను మ్యాచ్ లో నిలబెట్టాడు. టెయిలండర్ల సహకారంతో కీలకమైన 90 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. జురెల్ ఆటతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (28) ఆకాష్ దీప్ (3) ఉన్నారు చక్కని సహకారం అందించారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. 7 వికట్లకు 219 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన మన జట్టుకు కుల్దీప్ యాదవ్ కొంతసేపటికే ఔటయ్యాడు. 28 పరుగులు చేసిన కుల్దీప్.. మూడో రోజు ఉదయాన్నే అండర్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.ఆ తర్వాత ఆకాష్ దీప్ తో 9 వ వికెట్ కు విలువైన 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ దశలో బషీర్ ఒక అద్భుతమైన బంతితో ఆకాష్ దీప్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఈ వికెట్ తో బషీర్ తన టెస్ట్ కెరీర్ లో తొలి సారి 5 వికెట్ల ఘనతను సాధించాడు.
చివరి వికెట్ కు సిరాజ్ తో 14 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. 90 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో కెరీర్ లో తొలిసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. టామ్ హర్టీలి మూడు వికెట్లు తీసుకున్నాడు. అండర్సన్ కు రెండు వికెట్లు దక్కాయి. రెండో రోజు ఆటలో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(117 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 73) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌటైంది.