దులీప్‌‌‌‌ ట్రోఫీలో ఇండియా ఎ పైచేయి

దులీప్‌‌‌‌ ట్రోఫీలో ఇండియా ఎ పైచేయి

అనంతపూర్‌‌‌‌: బ్యాటింగ్‌‌‌‌లో అవేశ్ ఖాన్‌‌‌‌ (51 నాటౌట్‌‌‌‌), బౌలింగ్‌‌‌‌లో  ఆఖీబ్ ఖాన్‌‌‌‌ (3/43) రాణించడంతో దులీప్‌‌‌‌ ట్రోఫీలో ఇండియా–సితో  చివరి రౌండ్ మ్యాచ్‌‌‌‌లో ఇండియా–ఎ పైచేయి సాధించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు  224/7తో రెండో రోజు, శుక్రవారం ఆట కొనసాగించి ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 297 రన్స్ వద్ద ఆలౌటైంది. అవేశ్ ఖాన్‌‌‌‌ (51 నాటౌట్‌‌‌‌), ప్రసిధ్ కృష్ణ (34) జట్టుకు కీలక రన్స్ అందించారు. 

ప్రత్యర్థి బౌలర్లలో విజయ్‌‌‌‌ కుమార్ నాలుగు, అన్షుల్‌‌‌‌ మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఇండియా–సి రెండో రోజు ఆట చివరకు 216/7 స్కోరుతో నిలిచింది. టాపార్డర్‌‌‌‌‌‌‌‌ నిరాశ పరచగా  అభిషేక్ పోరెల్ (82), బాబా ఇంద్రజీత్ (34) జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం పుల్కిత్ నారంగ్ (35 బ్యాటింగ్‌‌‌‌), విజయ్‌‌‌‌కుమార్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆఖీబ్ ఖాన్‌‌‌‌ మూడు, శామ్స్ ములానీ రెండు వికెట్లు తీశారు. ఇండియా–ఎ స్కోరుకు ‘సి’ జట్టు ఇంకా 81 రన్స్‌‌‌‌ దూరంలో ఉంది. 

ఈశ్వరన్ సెంచరీ .. సూర్యకుమార్ ఫెయిల్‌‌‌‌

ఇండియా–డితో మ్యాచ్‌‌‌‌లో ఇండియా–బి జట్టును కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (116) సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో రెండో రోజు చివరకు ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 210/6 స్కోరు చేసింది. టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ (5) నిరాశపరిచాడు.   ప్రస్తుతం సుందర్ (39 బ్యాటింగ్‌‌‌‌), రాహుల్ చహర్ (0 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. అర్ష్‌‌‌‌దీప్ సింగ్‌‌‌‌ మూడు, ఆదిత్య థాకరే రెండు వికెట్లు పడగొట్టారు.  అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 306/5తో ఆట కొనసాగించిన  ఇండియా–డి తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 349 రన్స్‌‌‌‌ వద్ద ఆలౌటైంది. సంజు శాంసన్ (106) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నవదీప్‌‌‌‌ సైనీ ఐదు, రాహుల్ చహర్ మూడు వికెట్లు తీశారు.