మకే (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియా–ఎతో తొలి అనధికార టెస్టు మ్యాచ్‌లో ఇండియా–ఎ జట్టు ఓటమి అంచుల్లో నిలిచింది. ఇండియా ఇచ్చిన 225 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో మూడో రోజు, శనివారం చివరకు ఆసీస్ 139/3 స్కోరు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (47 బ్యాటింగ్), బ్యూ వెబ్‌స్టర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ విజయానికి చివరి రోజు 86 రన్స్ మాత్రమే అవసరం అవగా..
ఇండియాకు ఏడు వికెట్లు కావాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 208/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా–ఎ 312 రన్స్‌కు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ సాయి సుదర్శన్ (103) సెంచరీ పూర్తి చేసుకోగా.. దేవదత్ పడిక్కల్ (88) మరో 8 రన్స్ మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్ (32) ఫర్వాలేదనిపించగా.. నితీశ్ రెడ్డి (17), మానవ్ సుతార్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఫెర్గూస్ ఒనీల్ నాలుగు, టాడ్ ముర్ఫీ మూడు వికెట్లు తీశారు.