
భారత క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఈ మెగా లీగ్ తర్వాత మన ఆటగాళ్లు ఇంగ్లాండ్ టూర్ లో బిజీ కానున్నారు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ కు భారత జట్టును జూన్ రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది.
తొలి టెస్ట్ మే 30 నుండి కాంటర్‌బరీలోని స్పిట్‌ఫైర్ గ్రౌండ్‌లో జరుగుతుంది. రెండో టెస్ట్ జూన్ 6 నుండి నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఈ రెండు టెస్టుల్లో ఆటగాళ్ల ప్రదర్శన బట్టి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు జట్టును ఎంపిక చేయనున్నారు. అయితే అంతకంటే ముందు భారత ఏ జట్టులో కుర్రాళ్ళు స్థానం సంపాదించాలి. భారత ఏ జట్టులో కరుణ్ నాయర్ ను సెలక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్ ఈ ఫార్మాట్ లో కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు.
33 ఏళ్ల కరుణ్ నాయర్ 2017 నుండి టీమిండియా తరపున ఆడలేదు. 2016 లో ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ చేసిన ఈ కర్ణాటక బ్యాటర్ ఆ తర్వాత పేలవ ఫామ్ తో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఇటీవలే దేశవాళీ క్రికెట్ లో నాయర్ దుమ్ము రేపాడు. వరుస సెంచరీలతో హోరెత్తించాడు. దీంతో 8 ఏళ్ళ తర్వాత ఈ వెటరన్ ప్లేయర్ ను సెలక్ట్ చేయనున్నారు. గత ఏడాది ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అయ్యర్ చోటు కోల్పోయిన అయ్యర్ ఈ ఫార్మాట్ లో తన పునరాగమనాన్ని గొప్పగా చాటుకోవాలనుకుంటున్నాడు.
వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయ్యర్, కరుణ్ నాయర్ ఎంపిక చేసినట్టు సమాచారం. భారత ఏ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇటీవలే టెస్ట్ క్రికెట్ ఆడిన దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తమను నిరూపించుకోవడానికి మంచి ఛాన్స్. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్, హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను మోయనున్నారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి.. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ ఏ జట్టులో స్థానం దక్కించుకోనున్నారు. తనుష్ కోటియన్, సాయి కిషోర్, మానవ్ సుతార్ వంటి ఆటగాళ్లు ఈ టూర్ చక్కటి అవకాశం.
ఇంగ్లాండ్ లయన్స్ తో భారత ఏ జట్టు (అంచనా):
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, యశవి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్ ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, తనుష్ సుంత్ సుందర్, తనుష్ సుతుర్క్, ఆర్. ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, ముఖేష్ కుమార్
🚨 KARUN NAIR FOR ENGLAND TOUR 🚨
— Johns. (@CricCrazyJohns) March 27, 2025
- Karun Nair likely to be included in the India A team for the England tour. [PTI] pic.twitter.com/9ryPIwnj1f