భారత్‌ ఒక దేశం కాదు.. కొన్ని దేశాల సమూహం: DMK ఎంపీ రాజా 

భారత్‌ ఒక దేశం కాదు.. కొన్ని దేశాల సమూహం: DMK ఎంపీ రాజా 

భారతదేశం ఒక దేశం కాదని, ఉపఖండం అని డీఎంకే ఎంపీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశమంటే ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష ఉండాలన్న డీఎంకే నేత, భాతదేశంలో అలా లేదు కనుక భారత్‌ ఒక దేశం కాదని, ఉపఖండం అని వివరణ ఇచ్చారు. అంతేకాక, జై శ్రీరామ్, భారత్ మాత అనే బీజేపీ సిద్ధాంతాలను తమిళనాడు ఎన్నటికీ అంగీకరించబోదని ఆయన అన్నారు.

మార్చి 1న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజును పురస్కరించుకుని కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో రాజా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ఒక దేశం అంటే ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయం ఉండాలి. భారతదేశం ఒక దేశం కాదు, ఉపఖండం. ఇక్కడ తమిళం ఒక దేశం, మలయాళం ఒక దేశం. ఇలా దేశాలన్నీ కలిసి భారతదేశాన్ని ఏర్పరిచాయి. సంస్కృతులు కూడా వేరు వేరు.." అని రాజా అన్నారు.

మేం రాముడికి శత్రువులం

అంతటితో ఆగని డీఎంకే నేత తాము  రాముడికి శత్రువులమని వ్యాఖ్యానించారు. తనకు రాముడిపైన, రామాయణంపైన విశ్వాసం లేదంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ :- Nivetha Pethuraj: రూ.50 కోట్ల విలువైన గిఫ్ట్..రూమర్స్పై నివేదా సీరియస్!

"రాముడికి శత్రువు ఎవరు? రాముడు సీతతో కలిసి అడవికి వెళ్ళాడని నా తమిళ గురువు చెప్పారు. అతను ఒక వేటగాడిని అనుకరించాడు. అతను సుగ్రీవుడు, విభీషణుడిని తన సోదరులుగా అంగీకరించాడు. అక్కడ కులం లేదు, మతం లేదు. నాకు రామాయణం తెలియదు. లేదా నేను రాముణన్ని నమ్మను.." అని మాట్లాడారు. రాజా చేసిన ఈ ప్రసంగాన్ని బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.