బెంగళూరు: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నఇండియా–బి టీమ్ దులీప్ ట్రోఫీలో విజయం సాధించింది. రిషబ్ పంత్ (61), సర్ఫరాజ్ ఖాన్ (46) చెలరేగడంతో.. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో 76 రన్స్ తేడాతో ఇండియా–ఎపై గెలిచింది. 275 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు ఆఖరి రోజు బరిలోకి దిగిన ఇండియా–ఎ రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 198 రన్స్‌కు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (57), ఆకాశ్ దీప్ (43), రియాన్ పరాగ్ (31) ఫర్వాలేదనిపించారు.
ముషీర్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక అనంతపూర్‌లో ఇండియా–డితో జరిగిన మ్యాచ్‌లో ఇండియా–సి 4 వికెట్ల తేడాతో నెగ్గింది. 233 రన్స్ లక్ష్యాన్ని ఇండియా–సి 61 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్ (46), అర్యన్ జుయల్ (47), రజత్ పటీదార్ (44), అభిషేక్ పోరెల్ (35 నాటౌట్) రాణించారు.