ఓటమి ముంగిట ఇండియా అమ్మాయిలు

ఓటమి ముంగిట ఇండియా అమ్మాయిలు

గోల్డ్ కోస్ట్‌: ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ అమ్మాయిలు నిరాశపరుస్తున్నారు. ఇప్పటికే వన్డే, టీ20 సిరీస్‌‌‌‌లో పరాజయం పాలైన అమ్మాయిల జట్టు.. ఆస్ట్రేలియా–ఎతో ఏకైక అనధికారిక టెస్టులోనూ ఓటమి ముంగిట నిలిచింది. 

289 రన్స్ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో మూడో రోజు, శనివారం ఆట చివరకు ఇండియా  149/6తో కష్టాల్లో పడింది. శుభా సతీశ్‌‌‌‌ (45), ప్రియా పునియా (36), శ్వేత సెహ్రావత్ (21) మాత్రమే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం  రాఘవి బిస్త్ (16 బ్యాటింగ్‌‌‌‌), ఉమా ఛెత్రి (10 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు.  ఇండియా గెలవాలంటే మరో 140 రన్స్‌‌‌‌ అవసరం అవగా.. ఆసీస్‌‌‌‌కు నాలుగు వికెట్లు కావాలి. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 167/7తో   ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 260 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది.  మాడీ డార్కె (105 నాటౌట్‌‌‌‌) సెంచరీతో సత్తా  చాటింది. మిన్ను మణి ఆరు వికెట్లు పడగొట్టింది.