ప్రియా పాంచ్ పటాకా.. ఇండియా–ఎ విజయం

ప్రియా పాంచ్ పటాకా.. ఇండియా–ఎ విజయం

ఆస్ట్రేలియా: యంగ్ లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా ( 5/14) ఐదు వికెట్లతో విజృంభించడంతో ఆస్ట్రేలియా–ఎతో  చివరి వన్డేలో ఇండియా–ఎ అమ్మాయిలు ఘన విజయం సాధించారు. తొలి రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడి సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయినా.. ఆదివారం జరిగిన మూడో పోరులో 171 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసి ఊరట దక్కించుకున్నారు. 

ఏకపక్షంగా సాగిన మూడో వన్డేలో తొలుత ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 243/9 స్కోరు చేసింది. రాఘవి బిస్త్​ (53), తేజల్ హసబ్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22.1 ఓవర్లలో 72 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటై చిత్తుగా ఓడింది. మాడీ డార్కె (22), టెస్ ఫ్లింటాఫ్ (20), చార్లీ నాట్ (11) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరారు. ఇండియా బౌలర్లలో ప్రియాతో పాటు మిన్ను మని రెండు వికెట్లు పడగొట్టింది. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు మూడు టీ20ల్లోనూ ఓడిన ఇండియా అమ్మాయిలు.. ఆఖరాటలో గెలిచారు. ఇరు జట్ల మధ్య ఈ నెల 22 నుంచి గోల్డ్ కోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకైక అనధికార టెస్టు జరుగుతుంది.