రామ్​సర్ జాబితాలోకి మరో 4 చిత్తడి నేలలు.. ఇప్పుడు మొత్తం 89

రామ్​సర్ జాబితాలోకి మరో 4 చిత్తడి నేలలు.. ఇప్పుడు మొత్తం 89

ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం-2025 పురస్కరించుకుని భారతదేశం నుంచి మరో నాలుగు చిత్తడి నేలలను రామ్​సర్​ జాబితాలోకి చేర్చడంతో వీటి సంఖ్య 89కి చేరింది. తమిళనాడు రాష్ట్రంలోని సక్కరకోట్టై పక్షుల అభయారణ్యం, తీర్థంగల్​ పక్షుల అభయారణ్యం, సిక్కింలోని ఖేచెయోపల్రి చిత్తడి నేలలు, జార్ఖండ్​లోని ఉద్వా సరస్సు కొత్తగా రామ్​సర్ జాబితాలో చేరాయి.

నక్కరకోట్టై పక్షుల అభయారణ్యం
ఈ అభయారణ్యాన్ని 2012, ఏప్రిల్​ 17న స్థాపించారు. 230.490 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇక్కడ వేప, పామిరా పామ్, గ్లోరియోసా సూపర్బా అనే వృక్షజాలం ఉన్నది. సింహం తోక గల మకాక్, జెయింట్​ స్క్విరెల్ , వలస పక్షులు.

తీర్థంగల్​ పక్షుల అభయారణ్యం
ఈ అభయారణ్యాన్ని 2010, డిసెంబర్ 15న స్థాపించారు. ఇది 29.29 హెక్టార్లలో విస్తరించి ఉన్నది. అసోనోజెటన్ నూటాన్స్, హైడ్రిల్లా వెర్టిసిల్లాటా, టామరిండస్ ఇండికా వంటి విభిన్న వృక్ష జాతులకు నిలయంగా ఉన్నది. 

ఖేచెయోపల్రి చిత్తడి నేల
ఈ చిత్తడి నేలను కోరికలు తీర్చే సరస్సుగా నమ్ముతారు. బౌద్ధులు, హిందువులుగా పవిత్రమైంది. స్థానికంగా దీనిని షో డిజో షో అని పిలుస్తారు. 

ఉద్వా సరస్సు
పటౌరా జీల్​(155 హెక్టార్లు), బ్రహ్మ జమాల్ పూర్​ జీల్(410 హెక్టార్లు) రెండు అతి పెద్ద నీటి వనరులు ఈ సరస్సులో భాగంగా ఉన్నాయి. 1991లో పక్షుల అభయారణ్యంగా గుర్తించారు. శీతాకాలంలో సెప్టెంబర్ నుంచి వలస పక్షులకు నిలయంగా ఉంటుంది. ఈ సరస్సు గంగా నదికి సమీపంలో ఉంది. 

దేశంలో గుర్తించిన తొలి రామ్​సర్ సైట్లు: 

  • చిల్కా సరస్సు(ఒడిశా), కియోలాడియా జాతీయ పార్క్(రాజస్తాన్)
  • అత్యధిక రామ్​సర్​సైట్లు కలిగిన రాష్ట్రాలు: తమిళనాడు(20), ఉత్తరప్రదేశ్(10)
  • దేశంలో అతిపెద్ద రామ్​సర్ సైట్: సుందర్బన్ మడ అడవులు(పశ్చిమబెంగాల్)
  • దేశంలో అతిచిన్న రామ్​సర్ సైట్: రేణుక వెట్​ల్యాండ్ (హిమాచల్​ప్రదేశ్​)