ట్రంప్తో ఒప్పందాలు మంచిదే..ఎగుమతులకు బూస్ట్ అంటున్న ఎక్స్పర్ట్స్

ట్రంప్తో ఒప్పందాలు మంచిదే..ఎగుమతులకు బూస్ట్ అంటున్న ఎక్స్పర్ట్స్
  • అమెరికా–ఇండియా ఒప్పందంతో మన ఎగుమతులకు బూస్ట్​
  • అంతర్జాతీయ మార్కెట్లో ఇండియా వాటా పెరిగే చాన్స్​
  • యూఎస్‌‌తో పెరగనున్న వ్యాపారం

న్యూఢిల్లీ:2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏడాదికి 500 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్ల (రూ.43.50 లక్షల కోట్ల) కు చేర్చాలని రెండు దేశాలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతులు భారీగా పెరుగుతాయని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. అమెరికా నుంచి క్రూడాయిల్‌‌‌‌, నేచురల్ గ్యాస్‌‌‌‌ను భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరింతగా దిగుమతి చేసుకోనుందని అంటున్నారు. 

టెక్నాలజీ, డిఫెన్స్, గ్రీన్​ ఎనర్జీపై శ్రద్ధ చూపాలని నిర్ణయించడం వల్ల ఇండియా ఎగుమతి రంగాలకు ఎంతో మేలు జరుగుతుంది. అంతర్జాతీయంగా మన పోటీతత్వం మరింత పెరుగుతుంది. ద్వైపాక్షిక వ్యాపారానికి గల అడ్డంకులను తొలగించి అంతా సజావుగా నడిచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ఎక్స్​పోర్ట్​ఆర్గనైజేషన్స్​(ఎఫ్‌‌‌‌ఐఈఓ) ప్రెసిడెంట్​అశ్వనీ కుమార్​అన్నారు. 

ప్రధాని మోదీ పర్యటనలో 500 బిలియన్​ డాలర్ల వాణిజ్య టార్గెట్​చాలా ముఖ్యమైన విజయమని ఇంటర్నేషనల్ ​ట్రేడ్​ఎక్స్​పర్ట్, హైటెక్​ గెయిస్​ చైర్మన్​ దీప్ ​కపూరియా అన్నారు. ‘‘అమెరికాతో ఇండియాకు వాణిజ్య మిగులు ఉంది. తాజా ఒప్పందం వల్ల మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతులు పెరుగుతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే,  ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశపై చర్చలు జరపడానికి ఇరు దేశాల నాయకులు అంగీకరించారు”అని ఆయన వివరించారు.

అమెరికా ఇన్వెస్టర్లకూ మేలే

ఇండియా, అమెరికా నిర్ణయం వల్ల అమెరికా ఇన్వెస్టర్లకూ ప్రయోజనం ఉంటుందని కపూరియా అన్నారు. ముఖ్యంగా ఇండియాలో వ్యాపారాలను విస్తరించాలనుకునే వాళ్లకు, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునేవాళ్లకూ ఉపయోగం ఉంటుందని చెప్పారు.  అయితే రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి  ఫ్రీట్రేడ్​ అగ్రిమెంట్(ఎఫ్‌‌‌‌టీఏ) ​మాత్రం సాధ్యం కాకపోవచ్చని గ్లోబల్​ ట్రేడ్​ రీసెర్చ్​ఇనీషియేటివ్​(జీటీఆర్ఐ) అనుమానం వ్యక్తం చేసింది. 

టారిఫ్​ల పెంపుపైనే అమెరికా శ్రద్ధ చూపుతోందని, ఎఫ్​టీఏల ఆధారిత టారిఫ్ ​కోతల గురించి తక్కువగా ఆలోచిస్తోందని జీటీఆర్​ఐ ఫౌండర్​అజయ్​శ్రీవాస్తవ చెప్పారు. ఇండియాకు సభ్యత్వం ఉన్న ఇండో–పసిఫిక్​ ఎకనమిక్ ​ఫ్రేమ్​వర్క్​(ఐపీఈఎఫ్​)లో చాలా వాణిజ్య అంశాలు ఉన్నాయని చెప్పారు. 

పూర్తిస్థాయి ఫ్రీట్రేడ్ ​అగ్రిమెంట్​కు బదులు సెక్టార్ల వారీగా ఒప్పందాల కోసం ప్రయత్నించడమే ఇండియాకు మేలని అభిప్రాయపడ్డారు. 2023లో అమెరికా, ఇండియా మధ్య వస్తువులు, సేవలలో ద్వైపాక్షిక వాణిజ్యం  190.08 బిలియన్ డాలర్లుగా ఉంది.

యూఎస్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై మనం వేస్తున్న టారిఫ్ తక్కువే..

అమెరికా వేయాలనుకుంటున్న పరస్పర టారిఫ్‌‌‌‌‌‌‌‌లపై ఇండియా స్పందించనుంది. చాలా యూఎస్  ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు 10 శాతం కంటే తక్కువే ఉంది.  టాప్ 100 ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై అయితే టారిఫ్ రేటు 5 శాతంలోపు ఉందని ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌లు చెబుతున్నారు. ఏయే ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై టారిఫ్‌‌‌‌‌‌‌‌ రేటు ఎంత ఉందో తెలియజేసే డేటాను ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో జరిగే వాణిజ్య చర్చల్లో యూఎస్‌‌‌‌‌‌‌‌కు అందివ్వాలని ప్రభుత్వం చూస్తోంది. 

ఈ డేటాను  కామర్స్ మినిస్ట్రీ, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కలిసి రెడీ చేయనున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై ఎక్కువ టారిఫ్‌‌‌‌‌‌‌‌లు ఉంటే తగ్గించాలని చూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కాగా,  యూఎస్ ఇండియాకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి.