IND vs ENG, 2nd Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్.. ఎంత స్కోర్ చేసిందంటే..?

IND vs ENG, 2nd Test: తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్.. ఎంత స్కోర్ చేసిందంటే..?

వైజాగ్ టెస్టులో టీమిండియా పర్వాలేదనిపించింది. తొలి ఇన్నిన్స్ లో 396 పరుగులకు ఆలౌటైంది. యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో టీమిండియాను గట్టెక్కించాడు. 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లతో 209 పరుగులు చేసి ఔటయ్యాడు. జట్టు స్కోర్ లో జైస్వాల్ సగానికి పైగా పరుగులు చేయడం విశేషం. జైస్వాల్ తర్వాత 34 పరుగులు చేసిన గిల్ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. రోహిత్, గిల్, అయ్యర్, పటిదార్ లతో కీలక భాగస్వామ్యాలను నెలకొల్పి భారత్ కు డీసెంట్ టోటల్ అందించాడు.  

తొలి రోజు ముగిసే సరికి 6 వికెట్లకు 336 పరుగులు చేసిన భారత్.. రెండో రోజు మరో 60 పరుగులు జోడించి అలౌటయ్యారు. అశ్విన్, జైస్వాల్ తొలి అరగంట సేపు అటాకింగ్ గేమ్ ఆడుతూ.. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. 20 పరుగులు చేసిన అశ్విన్ వికెట్ కీపర్ ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సహకారంతో జైస్వాల్ కెరీర్ లో తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

స్కోర్ వేగం పెంచే క్రమంలో జైస్వాల్ అండర్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. బుమ్రా(6), ముఖేష్ కుమార్(0) వెంటనే పెవిలియన్ కు చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, బషీర్, రెహన్ అహ్మద్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. హార్టీలి కు ఒక వికెట్ దక్కింది.