Syed Abid Ali: సునీల్ గవాస్కర్ టీంమేట్ కన్నుమూత.. భారత క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఫీల్డర్

Syed Abid Ali: సునీల్ గవాస్కర్ టీంమేట్ కన్నుమూత.. భారత క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఫీల్డర్

భారత దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ బుధవారం (మార్చి 12) కన్నుమూశారు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ అబిద్ అలీ బుధవారం నాడు యూఎస్ లో మరణించారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం అతని వయసు 83 సంవత్సరాలు. 8 సంవత్సరాలు భారత జట్టు తరపున విశిష్ట సేవలను అందించాడు. 1967 నుంచి 1975 వరకు టీమిండియాతో క్రికెట్ కెరీర్ కొనసాగించాడు. 1971 లో ఓవల్ టెస్ట్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. మిడిల్ ఆర్డర్ లో విలువైన పరుగులు చేయడంతో పాటు తన పేస్ బౌలింగ్ తో అద్భుతంగా రాణించాడు. 

ఇండియా తరపున 29 టెస్ట్ మ్యాచ్‌లలో అబిద్ 47 వికెట్లు పడగొట్టాడు.  భారత క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్ గా పేరు తెచ్చుకున్నాడు. వికెట్ల మధ్య అద్భుతంగా పరిగెత్తడంతో పాటు గ్రౌండ్ లో చురుకైన ఫీల్డర్ గా పేరుంది. 1967-68లో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తన డెబ్యూ మ్యాచ్ లో 55 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అబిద్ అలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను టెస్ట్‌లలో 1980 పరుగులు చేయడంతో పాటు 47 వికెట్లు కూడా పడగొట్టాడు.

వన్డే కెరీర్ విషయానికి వస్తే అతను జూలై 13, 1974న లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. జూన్ 14, 1975న మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో చివరి వన్డే మ్యాచ్‌ ఆడాడు. 187 పరుగులు చేసి 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.