వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఇండియా కూటమి నిర్ణయం

న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం బుధవారం లోక్‌‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్(సవరణ) బిల్లు 2024ను వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ బిల్లు ముస్లిం సమాజానికి వ్యతిరేకమేగాక, రాజ్యాంగానికి విరుద్ధమైనదని.. అందువల్ల దీన్ని పార్లమెంటులో  అడ్డుకుంటామని ప్రకటించింది. మంగళవారం (April 1) సాయంత్రం ఢిల్లీలో ఇండియా బ్లాక్ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. 

ఈ మీటింగులో కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతోపాటు తదితర ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌‌ఎస్‌‌పీ) ఎంపీ ఎన్‌‌కే ప్రేమచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.."లోక్‌‌సభలో  బుధవారం ప్రవేశపెట్టనున్న వక్ఫ్(సవరణ) బిల్లు 2024కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఇండియా బ్లాక్ పార్టీలన్నీ నిర్ణయించాయి. వాకౌట్​లు,  నిరసనలు లేకుండా బిల్లులోని లోపాలను ఎత్తి చూపుతాం" అని ప్రేమచంద్రన్ తెలిపారు.