నితీశ్ కోసం తలుపులు తెరిచే ఉన్నయ్

నితీశ్ కోసం తలుపులు తెరిచే ఉన్నయ్
  • లాలూ వ్యాఖ్య.. చర్చ దాటవేసిన సీఎం 

పాట్నా: బిహార్ సీఎం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్ కోసం ఇండియా కూటమి తలుపులు తెరిచే ఉన్నాయని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై నితీశ్ మాత్రం  ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇటీవల లాలూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ప్రతిపక్ష ఇండియా కూటమిలో తిరిగి చేరేందుకు నితీశ్ కుమార్​కు డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఆయన తన గేట్లను తీయాలి.

 ఇది ఇరువైపుల ప్రజల రాకపోకలను సులభతరం చేస్తుంది”అని అన్నారు. దీనిపై మీడియా గురువారం నితీశ్ స్పందన కోరగా.. ఆయన తన చేతులు ముడుచుకుని, నవ్వుతూ.. ‘‘ఏం చెప్తున్నారు?(క్యా బోల్ రహే హై)”అని బదులిచ్చి అంతటితో దాన్ని ముగించారు. దీంతో బిహార్ రాజకీయాల్లో తలపండిన నాయకులైన బడా భాయ్, ఛోటా భాయ్(లాలూ, నితీశ్) మధ్య మరోసారి పొత్తు కుదరొచ్చని విశ్లేషణలు, ప్రచారం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తన తండ్రి కామెంట్లపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘‘మీడియా ఉత్సుకతను సంతృప్తిపరచడానికి” ఈ కామెంట్లు చేసినట్లు కనిపిస్తోందని అన్నారు.