పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి నిరసన

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు ఇవాళ పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి కేంద్ర బడ్జెట్‌ను ఏకపక్షంగా రూపొందించారని విపక్ష నేతలు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ  ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌తో దేశ బడ్జెట్‌ అనే కాన్సెప్ట్‌ ధ్వంసమైందన్నారు. చాలా రాష్ట్రాల పట్ల ఎన్డీయే సర్కారు వివక్షపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. 

ఇది దేశ బడ్జెట్ కాదు.. బీజేపీ బడ్జెట్అని ఎద్దేవా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో  ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత, విపక్ష నేత రాహుల్‌ గాంధీ, అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, సంజయ్‌ రౌత్‌ తదితర ఇండియా కూటమి నాయకులు పాల్గొన్నారు.