7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా హవా కొనసాగుతోంది. బీజేపీ ఘోర ఓటమి చవిచూ సింది.13స్థానాలకు గాను ఇండియా కూటమి 10 స్థానాలకు గెలుచుకోగా.. బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒకచోట ఇండింపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు.
ఉత్తరాఖండ్ లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండు స్థానాల్లోనూ ఇండియా కూటమి విజయం సాధించి సత్తా చాటింది. హిమాచల్ ప్రదేశ్ లో మూడు స్థానాల్లో రెండింటిని ఇండియా కూటమి గెలుచుకుంది. ఒకటి మాత్రమే బీజేపీ గెలుచుకుంది. పశ్చిమ బెంగాల్ లో మొత్తం నాలుగు స్థానాలకు గాను నాలుగింటిని టీఎంసీ గెలుచుకుంది.
ALSO READ | దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ : రిజల్ట్స్ ఇవే
బీహార్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి విజ యం సాధించారు. ఇక పంజాబ్ ఇండియా కూటమికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. తమిళనాడులో డీఎంకే అభ్యర్థి విజయం సాధించంగా.. మధ్యప్రదేశ్ లో ఒక స్థానాన్ని మాత్రమే బీజేపీ దక్కించుకోగలిగింది.
- బీహార్ రాష్ట్రం రూపాలి అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇండి పెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్ , జేడీయూ అభ్యర్థి కలాధర్ ప్రసాద్ మండల్ పై 8వేల 246 ఓట్ల మెజారీతో గెలు పొందారు.
- హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కమలేస్ ఠాకూర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి హోశ్యార్ సింగ్ పై 9వేల 399 ఓట్లతో గెలుపొందింది.
- హిమాచల్ ప్రదేశ్ లోని హామీర్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పీందర్ పై కేవలం 1571ఓట్లతో గెలుపొందారు.
- హిమాచల్ ప్రదేశ్ లోని నాలాఘర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ బవా గెలుపొందారు. బీజే పీ అభ్యర్థి కేఎల్ ఠాకూర్ పై 8వేల 990ఓట్లతో గెలుపొందారు.
- మధ్య ప్రదేశ్ లోని అమర్ వరా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కమలేస్ ప్రతాప్ షా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సుఖ్ రాం దాస్ పై 3వేల 027ఓట్లతో గెలుపొందారు.
- పంజాబ్ లోని జలంధర్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి మోహిందర్ భగత్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శీతల్ అంగురాల్ పై 37వేల 325ఓట్లతో గెలుపొందారు.
- తమిళనాడులోని విక్రవంది నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి అన్నియార్ శివ గెలుపొందారు. పీఎంకే అభ్యర్థి అంబుమణి పై 67వేల 757ఓట్లతో గెలుపొందారు.
- ఉత్తరాఖండ్ లోని భద్రీనాథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లఖ్ పత్ సింగ్ భుటోలా గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ బండారిపై 5వేల 224ఓట్లతో గెలుపొందారు.
- ఉత్తరాఖండ్ లోని బంగ్లార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఖాజీ మహ్మద్ నిజాముద్దీన్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కర్తార్ సింగ్ భదానాపై 422ఓట్లతో గెలుపొందారు.
- పశ్చిమ బెంగాల్ లోని రాయ్ ఘంజ్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి కృష్ణ కళ్యాణి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి మనాస్ కుమార్ ఘోష్ పై 50వేల 077ఓట్లతో గెలుపొందారు.
- పశ్చిమ బెంగాల్ లోని రణగదక్షిణ్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి ముఖుత్ మణి అధికారి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ పై 39వేల 048ఓట్లతో గెలుపొందారు.
- పశ్చిమ బెంగాల్ లోని బగ్దా నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి మధుపర్న ఠాకూర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బినయ్ కుమార్ బిస్వాస్ పై 33వేల 455ఓట్లతో గెలుపొందారు.
- పశ్చిమ బెంగాల్ లోని మనిక్తల నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి సుప్తీ పాండే గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ చౌబే పై 62వేల 312ఓట్లతో గెలుపొందారు.