బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి తొలి టెస్ట్ ఆడుతుంది. అడిలైడ్ వేదికగా ఈ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ పర్యటనకు ముందు ఆసీస్ కు భారత్ కనీసం పోటీ అయినా ఇస్తుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తర్వాత ఒక్కసారిగా టీమిండియా ఊపందుకుంది. పింక్ బాల్ టెస్టులో ఆసీస్ 12 టెస్టుల్లో ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. మరోవైపు చివరిసారి ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ లో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది.
ఆస్ట్రేలియాకు రికార్డ్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ భారత్ ను ఓడించడం కష్టంగానే కనిపిస్తుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆతిధ్య జట్టు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ ఆడడం లేదు. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు ప్రాక్టీస్ లో గాయమైంది. మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఒకవేళ స్మిత్ దూరమైతే బ్యాటింగ్ భారమంతా ఖవాజా, హెడ్ మోయాల్సిందే.
ALSO READ : AUS vs IND: నేనైతే నోరు మూసుకునే వాడిని.. జైశ్వాల్ ధైర్యానికి హ్యాట్సాఫ్: ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్
మరోవైపు తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఒకరకంగా చూసుకుంటే రెండో టెస్టుకు మరింత బలంగా కనిపిస్తుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం ఖాయమైంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో అందరూ టచ్ లోకి వచ్చారు. బుమ్రా, కోహ్లీ టాప్ ఫామ్ ను కొనసాగిస్తే భారత్ 2-0 ఆదిక్యలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది