T20world cup2024G: ఫైనల్​ ఫైట్​ .. ఇవాళ సౌతాఫ్రికాతో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేన ఢీ

T20world cup2024G: ఫైనల్​ ఫైట్​ .. ఇవాళ సౌతాఫ్రికాతో రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేన ఢీ
  •     రెండో కప్పుపై టీమిండియా గురి
  •     తొలి ట్రోఫీపై కన్నేసిన సఫారీలు
  •     రా. 8 నుంచి డీడీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దాయాది పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మట్టి కరిపించి.. మెగా ఈవెంట్లలో తమకు కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా నడ్డి విరిచేసి.. గత సెమీఫైనల్లో తమను ఓడించిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదే చోట చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా పదేండ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చింది..!ఇదే ఊపును మరొక్క మ్యాచ్‌లో కొనసాగిస్తే చాలు ఇండియా రెండోసారి టీ20 చాంపియన్‌గా నిలుస్తుంది.

 గత నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో  ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో  డీలా పడ్డ సగటు అభిమాని గుండె గర్వంతో ఉప్పొంగేందుకు.. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో ఉన్న రోహిత్, కోహ్లీ ట్రోఫీ అందుకుని కుర్రాళ్ల కోసం దారి వదిలేందుకు.. హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దిగిపోతున్న  గురువు  రాహుల్ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విశ్వ కప్పుతో సగర్వంగా వీడ్కోలు పలికేందుకు మన జట్టు  వేయాల్సింది ఒక్క అడుగే..!

ఆ అడుగుకు.. మన విజయానికి అడ్డుగా ఉన్న సౌతాఫ్రికా అంత ప్రమాదకరమైన జట్టేమీ కాదు..!  ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్ మాదిరిగా సఫారీల పని కూడా పట్టేస్తే సరిపోతుంది..! పుష్కరం 
తర్వాత క్రికెట్ విశ్వవిజేతగా నిలిచే మరో చాన్స్  రోహిత్‌సేన  ముందుంది. ఈ అవకాశాన్ని  ఈసారి అస్సలు  ఇడువొద్దు ఇండియా..!

తొలి టీ20 వరల్డ్‌‌ కప్‌‌ను గెలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనల్‌‌కు దూసుకొచ్చిన సౌతాఫ్రికా.. మెగా టైటిల్‌‌ ఫైట్‌‌కు రెడీ అయ్యాయి. వరుస విజయాలతో హోరెత్తించిన ఇండియా ఫేవరెట్‌‌గా దిగుతుంటే.. తొలిసారి కప్‌‌ను నెగ్గాలని సఫారీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడెప్పుడో 1998లో ఐసీసీ నాకౌట్‌‌ ట్రోఫీ నెగ్గిన సౌతాఫ్రికా మళ్లీ ఇప్పటి వరకు మెగా టైటిల్ గెలవలేదు. ఈసారైనా కప్‌‌ కల నెరవేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 2011 వన్డే వరల్డ్‌‌ కప్‌‌ తర్వాత ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలవలేదు. చేతుల్లోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్న కప్‌‌ను ఈసారైనా అందుకునేందుకు రోహిత్‌‌సేన సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది.

బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బార్బడోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): తొలి ఎడిషన్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన టీమిండియా, తొలిసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన సౌతాఫ్రికా ఆఖరాటకు సిద్ధమయ్యాయి. మెగా టోర్నీలో  అజేయంగా దూసుకొచ్చిన ఇరు జట్లు శనివారం జరిగే మెగా ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2007లో సౌతాఫ్రికా గడ్డపైనే జరిగిన తొలి టీ20 కప్పులో విజేతగా నిలిచిన ఇండియా 2014లో ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన తర్వాత ఇన్నాళ్లకు మరోసారి టైటిల్ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది.  ఇంకోవైపు సౌతాఫ్రికా ఒకేసారి( 1998లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఐసీసీ ఈవెంట్‌లో విన్నర్‌‌గా నిలిచింది. వన్డే, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఏడుసార్లు సెమీఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే వెనుదిరిగింది. మరి, తొలిసారి మెగా ఫైనల్ ఆడుతున్న సౌతాఫ్రికా..  ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్న  టీమిండియాకు ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. 

విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆఖరి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గత వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదిరిగా ఈ టోర్నీలో టీమిండియా తిరుగులేని ఆట చూపెడుతోంది. ముఖ్యంగా పెద్ద జట్లపై ఘన విజయాలతో సత్తా చాటింది. కెప్టెన్ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (248), సూర్యకుమార్ (196), హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా  (139) ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపిస్తున్నాడు. కోచ్ ద్రవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పక్కా ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రత్యర్థుల పని పడుతున్నాడు. యూఎస్ గడ్డపై తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త వికెట్లపై ముగ్గురు పేసర్లతో ఫలితం రాబట్టిన అతను.. విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కుల్దీప్ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దింపి జట్టును ఫైనల్ చేర్చాడు. ఫైనల్లోనూ రోహిత్ కీలకం కానున్నాడు. అయితే ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అదరగొట్టిన విరాట్ ఈ టోర్నీలో ఏడు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో కలిపి 75 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 0, 9 స్కోర్లతో ఫెయిలయ్యాడు.  ఆఖరాటలో అయినా విరాట్ తన మార్కు చూపెట్టాల్సిన అవసరం ఉంది. కప్పు గెలిస్తే రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విరాట్ ఈ ఫార్మాట్ నుంచి తప్పుకునే చాన్సుంది. కాబట్టి ఫైనల్లో తమదైన ముద్ర వేస్తారేమో చూడాలి.  గత రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో నిరాశ పరిచిన వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషబ్ పంత్ ఫైనల్లో బాధ్యతగా ఆడాలి. ఈ టోర్నీలో తీవ్ర నిరాశపరుస్తున్న మరో ఇద్దరు ఆటగాళ్లు శివం దూబే, రవీంద్ర జడేజా. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫ్లాప్ అవుతున్న శివం దూబే గత పోరులో సున్నా చుట్టాడు. టోర్నీలో ఒకే ఒక్క వికెట్ తీసిన జడేజా బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనూ మెప్పించలేకపోతున్నాడు. అయినా మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ విన్నింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ను కొనసాగించనుంది. ఇక సెమీస్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బౌలర్లు బుమ్రా, అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సఫారీలపై రిపీట్ చేస్తే ఇండియాకు తిరుగుండదు. 
 
బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలంతో సఫారీలు

ఐసీసీ ఈవెంట్లలో అద్భుతంగా ఆడుతూ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాగానే తడబడటం సౌతాఫ్రికాకు అలవాటు. కానీ, ఈ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అఫ్గాన్ పని పట్టిన సఫారీలు ఆఖరాటలోనూ గెలిచి నాకౌట్ ఫోబియా నుంచి పూర్తిగా బయటపడాలని చూస్తున్నారు. అయితే, అత్యంత బలంగా ఉన్న ఇండియాను పడగొట్టడం అంత సులభం కాబోదు. ఈ టోర్నీలో  ఎనిమిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ నెగ్గినప్పటికీ  సౌతాఫ్రికా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొన్ని బలహీనతలు ఉన్నాయి. చిన్న జట్లపై కూడా సఫారీలు కష్టపడి గెలిచారు. ముఖ్యంగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్ స్కోరర్లు  డికాక్ (204 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (148 ఈ రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) టోర్నీ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–10 బ్యాటర్ల లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8, 16 స్థానాల్లో ఉన్నారు. ఇండియాకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఓపెనర్లు డికాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కెప్టెన్ మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాట్ ఝుళిపించాల్సి ఉంటుంది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టిన హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టాన్ స్టబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్పిన్ త్రయం దాడిని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తి కరం. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సఫారీలు కాస్త బలంగా ఉన్నారు. వికెట్ల వీరుల జాబితాలో ముందు వరుసలో లేకపోయినా పేసర్లు మార్కో జాన్సెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రబాడ, అన్రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు స్పిన్నర్లు కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షంసి సమష్టిగా 
రాణిస్తున్నారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ  జట్టును ముందుకు తీసుకొచ్చారు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడినా పోయేదేమీ లేదు కాబట్టి సఫారీలు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది.

సఫారీలకు ప్రయాణ ఇబ్బందులు

ఫైనల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు సౌతాఫ్రికా ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొన్నది. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగిన తరౌబా నుంచి ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఆరు గంటలు ఆలస్యంగా బార్బడోస్ చేరుకుంది. బార్బడోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో ఓ ప్రైవేట్ జెట్ విమానం ల్యాండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇబ్బంది ఎదురైంది. దీనిపై అక్కడి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు  అధికారులు చేపట్టిన విచారణ పూర్తయ్యేంత వరకూ ఆ రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేను మూసి వేయడంతో సఫారీ ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులు, పలువురు ఐసీసీ అధికారులు తరౌబా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు టర్మినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఆరు గంటలు పడిగాపులు కాశారు.

పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/వాతావరణం

కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టన్ ఓవర్ స్టేడియంలోని  నాలుగో వికెట్‌‌ ను ఫైనల్‌‌కు ఉపయోగిస్తున్నారు. ఇక్కడి బౌలర్లకు అనుకూలిస్తుంది. స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపు తున్నారు. ఇక,  శనివారం  మొత్తం వర్షం కురిసే అవకాశం ఉంది. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిజర్వ్ డే (ఆదివారం) ఉంది.

జట్లు (అంచనా)

ఇండియా:  రోహిత్  (కెప్టెన్),  కోహ్లీ,  పంత్ (కీపర్), సూర్య, దూబే, పాండ్యా , జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బుమ్రా.
సౌతాఫ్రికా:  డికాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), స్టబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జాన్సెన్, కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రబాడ, అన్రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షంసి/బార్ట్‌‌‌‌మన్