హెర్మొసిలో (మెక్సికో): ఇండియా కాంపౌండ్ ఆర్చర్ ప్రథమేశ్ జావ్కర్ ఆర్చరీ వరల్డ్‌కప్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిశాడు. కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడ్డ అతను షూటాఫ్‌లో తడబడి గోల్డ్‌ను కొద్దిలో చేజార్చుకున్నాడు.
ఆదివారం జరిగిన తుదిపోరులో ప్రథమేశ్, డెన్మార్క్‌కు చెందిన మథియాస్ ఫుల్లెర్టన్ తొలుత 148–148తో సమంగా నిలిచారు. షూటాఫ్‌లో ఇద్దరూ చెరో పది పాయింట్లు సాధించారు. కానీ, ఫుల్లెర్టన్ బాణం సెంటర్‌కు దగ్గరగా ఉండటంతో అతడిని విజేతగా ప్రకటించారు. విమెన్స్ కాంపౌండ్ సెక్షన్‌లో వెన్నం జ్యోతి సురేఖ, అదితి ఫస్ట్ రౌండ్‌లోనే ఓడారు.