
పారిస్ : ర్యాంకింగ్ రౌండ్స్‌లో సూపర్ షో చూపెట్టిన ఇండియన్ ఆర్చర్లు మెడల్ పోరాటానికి రెడీ అయ్యారు. నేడు జరిగే విమెన్స్ క్వార్టర్‌ఫైనల్లో అంకితా భకట్–దీపిక కుమారి–భజన్ కౌర్‌తో కూడిన ఇండియా త్రయం గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పతకం రావాలంటే కనీసం మరో రెండు విజయాలు సాధించాల్సిన నేపథ్యంలో క్వార్టర్స్‌తో పాటు సెమీస్‌లోనూ సత్తా చాటాలని మన ఆర్చర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫ్రాన్స్– నెదర్లాండ్స్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌తో ఇండియా క్వార్టర్స్ మ్యాచ్ ఆడనుంది. సౌత్ కొరియా, చైనా, మెక్సికో పోటీని తట్టుకుంటే కచ్చితంగా పతకాన్ని ఆశించొచ్చు. సోమవారం మెన్స్ టీమ్ విభాగంలో మెడల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 1998 సియోల్ ఒలింపిక్స్ నుంచి ఇండియన్ ఆర్చర్లు బరిలోకి దిగుతున్నా ఇప్పటి వరకు సెమీస్‌ను దాటలేకపోయారు. దీంతో 32 ఏళ్ల తర్వాతైనా ఆర్చరీలో తొలి పతకం నెగ్గాలని ఆశిస్తున్నారు.