India A vs Australia A: కంగారులపై భారత్ అట్టర్ ఫ్లాప్.. 107 పరుగులకే ఆలౌట్

India A vs Australia A: కంగారులపై భారత్ అట్టర్ ఫ్లాప్.. 107 పరుగులకే ఆలౌట్

ఆస్ట్రేలియా ఏ జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ఏ జట్టు తొలి రోజు ఫ్లాప్ షో చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా దారుణ బ్యాటింగ్ తో నిరాశపరిచింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయింది. 36 పరుగులు చేసి దేవ్ దత్ పడిక్కల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సాయి సుదర్శన్ (21), నవదీప్ సైనీ (23) మినహాయిస్తే మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 

ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రెండన్ డాగెట్ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. జోర్డాన్ బకింగ్‌హామ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఫెర్గస్ ఓ నీల్. మర్ఫీకి తలో వికెట్ లభించింది. అంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. కెప్టెన్ మెక్ స్విల్లి (29) కొనొల్లి (14) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్ అద్భుతంగా రాణించి తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

ALSO READ | Ben Stokes: స్టోక్స్ ఇంటిలో దొంగలు.. నగలు, విలువైన వస్తువులు చోరీ

ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గోల్డెన్ డకౌట్ కాగా.. సూపర్ ఫామ్ లో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులు మాత్రమే చేశాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పరుగులేమీ చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగాడు. వీరితో ఇషాన్ కిషన్(4) బాబా ఇంద్రజిత్(9), మానవ్ సుతార్(1) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 3 వికెట్లకు 71 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్.. తమ చివరి 7 వికెట్లను 36 పరుగుల వ్యవధిలో చేజార్చుకుంది.