అల్ అమెరాత్ : ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్‌లో ఇండియా–ఎ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఆయుష్ బదోనీ (51), తిలక్ వర్మ (36), అభిషేక్ శర్మ (34) చెలరేగడంతో.. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా–ఎ 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై గెలిచింది. దీంతో మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌తో సెమీస్‌లోకి అడుగుపెట్టింది. టాస్ నెగ్గిన ఒమన్ 20 ఓవర్లలో 140/5 స్కోరు చేసింది.
మహ్మద్ నదీమ్ (41) టాప్ స్కోరర్. హమద్ మీర్జా (28 నాటౌట్), వాసిమ్ అలీ (24), జితేందర్ సింగ్ (17) ఫర్వాలేదనిపించారు. అకీబ్ ఖాన్, రసిఖ్ సలామ్, నిశాంత్, రమణ్‌దీప్, సాయి కిశోర్ తలో వికెట్ తీశారు. తర్వాత ఇండియా 15.2 ఓవర్లలో 146/4 స్కోరు చేసి నెగ్గింది. అనూజ్ రావత్ (8), నేహల్ వాధెరా (1) ఫెయిలైనా, అభిషేక్, తిలక్, బదోనీ ఈజీగా మ్యాచ్ గెలిపించారు. బదోనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌తో ఇండియా
తలపడుతుంది.