మాకు ఉపన్యాసాలిచ్చే స్థాయిలో మీరు లేరు!..పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

మాకు ఉపన్యాసాలిచ్చే స్థాయిలో మీరు లేరు!..పాకిస్తాన్ కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
  • ఐరాస వేదికగా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భారత్ మరోసారి స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి హ్యూమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైట్స్ కౌన్సిల్ (యూ ఎన్​హెచ్​ఆర్​సీ) వేదికగా పాకిస్తాన్​కు భారత్​మరోసారి స్ట్రాంగ్​ కౌంటర్​ఇచ్చింది. జెనీవాలో గురువారం జరిగిన యూ ఎన్​హెచ్​ఆర్​సీ 58వ సెషన్ ఏడో సమావేశంలో పాకిస్తాన్ న్యాయ మంత్రి అజామ్ నజీర్ తరార్ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. 

దీంతో.. తరార్ వ్యాఖ్యలపై భారత రాయబారి క్షితిజ్​ త్యాగి తీవ్ర అభ్యంతరం చెప్పారు. "జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమే. దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిజంతో బాధపడుతున్న ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని తేవడానికి నిబద్ధతతో పనిచేస్తున్నాం.  కొన్నేండ్లుగా జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అపూర్వమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతి  సాధిస్తున్నాం. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఈ విజయాలు నిదర్శనం. 

ఈ క్రమంలో పాకిస్తాన్ మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థితిలో లేదు" అని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ తన సొంత దేశంలోని సంక్షోభాలను పరిష్కరించుకోవడంలో విఫలమైనప్పటికీ.. భారత్​పై తన వ్యతిరేకతను బయటపెట్టేందుకు మాత్రం అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందన్నారు. 

మైనారిటీలను హింసించడం,  టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించడం వంటి ట్రాక్ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిగిన పాకిస్తాన్ కు.. మానవ హక్కులపై మాట్లాడే విశ్వసనీయత లేదన్నారు.