న్యూఢిల్లీ: ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు జరుగుతున్న ఎగుమతులు భారీగా పెరిగాయి. కిందటేడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్‌లో 64.4 శాతం వృద్ధి చెంది 643.7 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. టెక్స్‌టైల్స్, కెమికల్స్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ సెక్టార్లలో గ్రోత్ కనిపించింది. అయినప్పటికీ ఆస్ట్రేలియాకు చేస్తున్న గూడ్స్ ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–నవంబర్‌లో 5.21 శాతం తగ్గి 5.56 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి.
ఇరు దేశాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్-–నవంబర్‌లో 16.3 బిలియన్ డాలర్ల వ్యాపారం(ఎగుమతులు, దిగుమతులు కలిపి) జరిగింది. ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్‌ను 2022 డిసెంబర్ 29 నుంచి ఇవి అమలు చేస్తున్నాయి.