కేంద్ర ప్రభుత్వం 2013 జూలై 14న టెలిగ్రామ్ సర్వీసులను రద్దు చేసింది. అసలు టెలిగ్రామ్ అంటే ఏంటి? 163 సంవత్సరాలు టెలిగ్రామ్ సేవలను భారతీయులు ఏలా వాడుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
టెలిగ్రాఫీ అనేది కోడెడ్ సిగ్నల్స్ ఉపయోగించి సమాచారాన్ని సుదూర ప్రాంతాలకు చేరవేసే పద్దతి. టెలిగ్రాఫ్ అనే పదం నుంచే టెలిగ్రామ్ అనే ఎలక్ట్రికల్ టెలిగ్రామ్ ను సూచిస్తుంది. దీన్ని అమెరికన్ చిత్రకారుడు శ్యాముల్స్ FB మోర్స్ కనుగొన్నాడు.1832 నుంచి మోర్స్ అనే శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల వల్ల 1837 టెలిగ్రాఫ్ సిస్టమ్ వచ్చింది. దాన్ని తర్వాత రోజుల్లో టెలిగ్రామ్ అన్నారు.
పకృతి విపత్తు, యుద్దాలు, ప్రభుత్వ ప్రకటనలు చేయడానికి ఈ వ్యవస్థ బాగా ఉపయోగపడింది. అయితే తర్వాత పెరిగిన ఎలక్ట్రినిక్ కమ్యూనికేషన్ తో టెలిగ్రాఫ్ కు ఆదరణ తగ్గింపోయింది.1980లలో టెలిగ్రామ్ సేవలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, భారతదేశంలోని 45వేల కార్యాలయాలకు దాదాపు 60 మిలియన్ టెలిగ్రామ్‌లు పంపడం, స్వీకరించడం జరిగింది. 2023 జూలై 13న దేశవ్యాప్తంగా ఉన్న టెలిగ్రామ్ సేవలను రద్దు చేసింది ప్రభుత్వం.