విశాఖపట్నం: తొలి టెస్టులో ఇండియా స్పిన్ బౌలింగ్‌ను స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఎటాక్ చేసి సక్సెస్ అయ్యారు. ఇండియా బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. రెండో టెస్టులోనూ స్పిన్ వికెట్ రెడీ అవుతున్న నేపథ్యంలో ఇండియా బ్యాటర్లు తమ స్వీపింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు. వైజాగ్‌లో బుధవారం జరిగిన నెట్ సెషన్‌లో రోహిత్ మినహా మిగతా బ్యాటర్లు స్వీప్ షాట్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
మధ్యాహ్నం జరిగిన ఈ సెషన్‌కు టీమ్ మొత్తం హాజరైంది. ఫామ్‌లో లేని ఓపెనర్ శుభ్‌మన్ గిల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన రజత్ పటీదార్ స్వీప్, రివర్స్ స్వీప్స్‌పైనే దృష్టి పెట్టారు. మరో కొత్త ఆటగాడు సర్ఫరాజ్ కూడా నెట్ సెషన్‌లో పాల్గొన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ నెట్ సెషన్‌లో ఆ టీమ్ సీనియర్ ప్లేయర్ జో రూట్ లెఫ్టాండ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
రెండో టెస్టుకు లీచ్ దూరం! ఇంగ్లండ్ సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన లీచ్ ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు